Tdp Mahanadu: ఈసారి ఉత్తరాంధ్రలో మహానాడు..! టీడీపీ పొలిటికల్ స్కెచ్ అదేనా..!
2023లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరిగింది. సూపర్ సిక్స్ పథకాలపై ఆనాడే ప్రస్తావించారు. దాంతో గోదావరి జిల్లాల్లో రాజకీయం గేర్ మార్చింది. అలా వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేసి కూటమి కట్టి మరీ టీడీపీ గోదావరి తీరంలో రాజకీయాన్ని తమవైపు తిప్పుకుంది.
- గతేడాది కడప గడపలో మహాసంబరం నిర్వహించిన టీడీపీ
- ఈసారి ఉత్తరాంధ్ర సెంట్రిక్‌గా మహానాడు జరిపే ప్లాన్
- ఆ మూడు ఉమ్మడి జిల్లాలపై టీడీపీ స్పెషల్ ఫోకస్
Tdp Mahanadu: తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ. చారిత్రక విజయం సాధించిన తర్వాత రెండోసారి నిర్వహిస్తున్న మహాసంబరం. పార్టీ ఆవిర్భావ వేడుక పసుపు పండుగను అంబరాన్నంటేలా..యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు రెడీ అవుతోంది తెలుగుదేశం పార్టీ. గతేడాది..రాయలసీమ సెంట్రిక్‌గా కడప వేదికగా కనీవినీ ఎరుగని రీతిలో..మహానాడును నిర్వహించిన టీడీపీ..ఇప్పుడు మరో పొలిటికల్ స్కెచ్ వేస్తోందట. ఈసారి ఉత్తరాంధ్రలో పసుపు పండుగను ఓ రేంజ్లో జరపాలనే ప్లాన్ చేస్తున్నారట.
మహానాడు టీడీపీకి ఒక పండుగ. పార్టీలో ఉన్న క్యాడర్ మొత్తం ఎంతో ఉత్సాహంగా పాల్గొనే అతిపెద్ద సంబరం. 2024లో అధికారంలోకి వచ్చాక తొలిసారి తొలి గడప కడపలో మహానాడును గ్రాండ్ సక్సెస్ చేసింది టీడీపీ. అంతకముందు 2023లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరిగింది. సూపర్ సిక్స్ పథకాలపై ఆనాడే ప్రస్తావించారు. దాంతో గోదావరి జిల్లాల్లో రాజకీయం గేర్ మార్చింది. అలా వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేసి కూటమి కట్టి మరీ టీడీపీ గోదావరి తీరంలో రాజకీయాన్ని తమవైపు తిప్పుకుంది. ఇక 2024లో మహానాడు నిర్వహించ లేదు. అప్పటికి ఏపీలో ఎన్నికలు పూర్తై..ఫలితాల కోసం వేచి చూసే పరిస్థితి. దాంతో 2025లో మహానాడును ఘనంగా నిర్వహించారు. ఈసారి మహానాడును అంతకు మించి అన్నట్లుగా నిర్వహించేందుకు రెడీ అవుతోంది టీడీపీ. గతేడాది రాయలసీమ సెంట్రిక్‌గా పార్టీ పండుగ జరిగితే..ఈసారి ఉత్తరాంధ్రలో మహానాడు పెట్టాలని ప్లాన్ చేస్తోంది.
పెద్ద నగరాలు, ట్రాన్స్పోర్ట్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నచోటే మహానాడు..
ఎన్నికలు అయిపోయి రెండేళ్లు దగ్గరపడుతున్నా..దారుణమైన ఓటమితో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వైసీపీ ఓటమి షాక్‌లో ఉండగానే..కడపలో మహానాడు నిర్వహించాచి గ్రాండ్ సక్సెస్ చేసింది టీడీపీ. ఈసారి ఉత్తరాంధ్రలో మహానాడును విజయవంతం చేసి..అక్కడా వైసీపీని కోలుకోకుండా చేయాలనేది టీడీపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. టీడీపీ మహానాడును పెద్ద నగరాలు, ట్రాన్స్పోర్ట్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నచోటే నిర్వహించే వారు.
గతేడాది నుంచి పార్టీ ఆలోచన మారింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ వేడుక నిర్వహించాలనే భావనతో గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేస్తున్నారు.
ఈసారి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం-విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో పసుపు పండుగ నిర్వహణకు సిద్ధమైందని అంటున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గాల పరిధిలో మహానాడు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు నియోజవకర్గాలలో మూడు స్థలాలను పరిశీలించిన టీడీపీ ముఖ్యనేతలు..త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో విజయనగరం టీడీపీలో హడావుడి పెరిగిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి టీడీపీ అభిమానులు, కార్యకర్తలు మహానాడుకు తరలివచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
అందుకే ఈసారి విజయనగరం జిల్లాలో మహానాడు..
కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర సెంట్రిక్‌గానే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్‌ను తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు. వైజాగ్‌లో ఐబీఎం, అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌తో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అటు విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావొస్తోంది. ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు, కంపెనీలు ఉత్తరాంధ్రకు తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్..మహానాడు వేదికగా తాము చేసిన డెవలప్మెంట్ను ప్రజలకు వివరించే ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈసారి ఉత్తరాంధ్రలోని.. విజయనగరం జిల్లాలో మహానాడును నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీలో నవశకం.. నేడు అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ప్రారంభం..
