West godavari : బస్సు ప్రమాదానికి కారణం..ఈ పాపం ఎవరిది ?

ప్రమాదం జరిగిన బస్సుకు 20 రోజుల క్రితమే మెయింటినెన్స్ లేక స్టీరింగ్ పట్టేస్తుందని డ్రాఫ్ట్ షీట్ లో సిబ్బంది నమోదు చేశారు.

west godavari

West godavari Bus Accident: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరింది. అర్ధరాత్రి సమయంలో జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు హస్పిటల్ కు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో మంగర లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. వీరి మరణానికి కారణం ఏంటీ ? బస్సు ప్రమాదం జరగడానికి, డ్రైవర్ చిన్నారావు చనిపోవడానికి బస్సుల మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమేనని సిబ్బంది ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన బస్సుకు 20 రోజుల క్రితమే మెయింటినెన్స్ లేక స్టీరింగ్ పట్టేస్తుందని డ్రాఫ్ట్ షీట్ లో సిబ్బంది నమోదు చేశారు. బస్సులకు మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ తాటినేని పద్మావతికి జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో సిబ్బంది ఫిర్యాదు చేశారు.

Read More : Chyawanprash : రోగనిరోధక శక్తి పెంచే చవన్ ప్రాశ్…ఇంట్లోనే తయారీ ఎలాగంటే?..

మరోవైపు….బస్సు ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు. జంగారెడ్డిగూడెం నుంచి 9 కిలో మీటర్ల దూరంలో ప్రమాదం చోటు చేసుకుంది. జల్లేరువాగు బ్రిడ్జ్‌ రేలింగ్‌ను ఢీకొని వాగులోకి దూసుకెళ్లింది. 50 అడుగుల ఎత్తు నుంచి వాగులో పడింది బస్సు. జల్లేరువాగు దగ్గరికి బస్సు వచ్చిన సమయంలో ఎదురుగా లారీ వచ్చిందని.. దీంతో డ్రైవర్ బస్సును లెఫ్ట్‌కు తీసుకోవడంతో రెయిలింగ్‌ను ఢీకొట్టి వాగులో పడిపోయిందని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు. బస్సులో లోపం లేదని మానవ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందన్నారు.

Read More : Airplane Crash : కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి

ఇక… జల్లేరువాగులో పడిపోయిన బస్సును బయటకు తీశారు అధికారులు. రెండు క్రేన్‌లతో పాటు అక్కడ ఉండే ప్రజల సాయంతో బస్సును వెలుపలికి తెచ్చారు. బస్సులో ఎవరూ ఇరుక్కుని లేకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలోనే డ్రైవర్‌తో పాటు 11 మంది ప్రమాదంలో చనిపోయారు. బస్సులో మొత్తం 47 మంది ఉండగా.. వారిలో పదకొండు మంది గురించి ఇంకా ఆచూకీ తెలియడం లేదు. బస్సు ప్రమాదంపై విచారణ జరుపుతామన్నారు అధికారులు. ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు సీఎం జగన్‌. మరోవైపు.. మృతుల కుటుంబాలకు కేంద్రం 2 లక్షల పరిహారం ప్రకటించింది. ఆర్టీసీ సైతం రెండున్నర లక్షల పరిహారం అందించనుంది.