GN RAO కమిటీ రిపోర్టుపై అబద్దపు ప్రచారాలు – రోజా

  • Publish Date - January 30, 2020 / 06:46 AM IST

వైజాగ్‌లో రాజధాని పెడితే ప్రమాదమని GN RAO కమిటీ చెప్పినట్లు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కమిటీ రిపోర్టుపై మాట్లాడే అర్హత బాబు, లోకేష్‌లకు లేదన్నారు. 2020, జనవరి 30వ తేదీ గురువారం తిరుమలకు వచ్చిన ఆమె..శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…

* ఏపీ రాజధానిగా విశాఖ బెస్ట్ అన్నారు. 
* రాష్ట్రంలో విశాఖ ఒక్కటే మెట్రోపాలిటన్ నగరం అన్నారు. 
* అన్ని ప్రాంతాల్లోనూ తుఫాన్లు వస్తాయన్నారు. 
* సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్లు రావడం కామన్ అన్నారు. 

గత ఐదు సంవత్సరాలుగా ఏపీని చంద్రబాబు నాశనం చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని బాగు చేసుకొనే అవకాశం..భగవంతుడు తమకు ఇప్పుడు కల్పించారని, కానీ బాబు మాత్రం అడ్డు పడుతున్నారని నిప్పులు చెరిగారు. 

రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే..మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ప్రజల ఆకాంక్ష మేరకు మూడు రాజధానుల ఏర్పాటు, మండలి రద్దు  జరిగిందన్నారు. తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే..బాబు పోరాటం చేస్తున్నారని, దీనికి కూడా బాబు అడ్డు తగులుతున్నారని విమర్శించారు. 
తన కొడుకు పదవి పోతుందనే భయంతో బాబు యూ టర్న్ తీసుకున్నారని తెలిపారు. 

* రాజధాని విశాఖపై GN RAO కమిటీ చెప్పిన అంశాలను టీడీపీ ప్రస్తావిస్తోంది. విశాఖ రాజధాని గురించి పత్రికలో వచ్చిన కథనాలపై జీఎన్ రావు స్పందించారు. 
* విశాఖకు తుఫాన్ల ముప్పు ఉందన్న అంశం దాచిపెట్టారనే విషయంపై ఆయన వివరణ ఇచ్చారు.
* తీర ప్రాంతానికి దూరంగా రాజధాని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టంగా సూచించినట్టు జీఎన్ రావు చెప్పారు. 
Read More : వీరు మనుషులేనా : బాలుడిపై యువకుల అత్యాచారం