Kethu Viswanatha Reddy Died : ప్రముఖ కథా రచయిత, కవి కేతు విశ్వనాథ రెడ్డి గుండెపోటుతో మృతి.. సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం

కేతు విశ్వనాథరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు.

CM Jagan Condolences : ప్రముఖ కథా రచయిత, కవి కేతు విశ్వనాథ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. కడపకు చెందిన కేతు విశ్వనాథ రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న తన కూతురు వద్దకు వచ్చారు. ఈ రోజు (సోమవారం) తెల్లవారు జామున ఆయనకు గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కేతు విశ్వనాథ రెడ్డిని ఒంగోలులోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

కేతు విశ్వనాథ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపారు. ఆయన హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సామాజిక సంస్కరణల ఆవశ్యకతను చెబుతూ విశ్వనాథరెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు.

Supreme Court : ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీష‌న్ విచారణకు నిరాక‌రించిన సుప్రీంకోర్టు

విశ్వనాథ రెడ్డి సేవలను గుర్తించి 2021లో వైఎస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిన విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. విశ్వనాథ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు