Supreme Court : ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీష‌న్ విచారణకు నిరాక‌రించిన సుప్రీంకోర్టు

బెయిల్ పిటీష‌న్ విచారించేలా హైకోర్టు వెకేష‌న్ బెంచ్ ను ఆదేశించాల‌ని గ‌తంలో సుప్రీంకోర్టులో అవినాశ్ రెడ్డి పిటీష‌న్ దాఖ‌లు చేశారు.

Supreme Court : ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీష‌న్ విచారణకు నిరాక‌రించిన సుప్రీంకోర్టు

Avinash Anticipatory Bail Petition

Avinash Reddy Anticipatory Bail Petition : ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీష‌న్ ను విచారించ‌డానికి సుప్రీంకోర్టు వెకేష‌న్ బెంచ్‌ నిరాక‌రించింది. మెన్ష‌నింగ్ లిస్ట్ లో ఉంటేనే విచారిస్తామ‌ని న్యాయ‌మూర్తి అనిరుద్ద్ బోస్, సంజ‌య్ క‌రోల్‌ ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. రేపు(మంగళవారం) మెన్ష‌నింగ్ ఆఫీస‌ర్ ముందుకు వెళ్లాల‌ని న్యాయ‌మూర్తి అనిరుద్ బోస్ ద‌ర్మాస‌నం సూచించింది.

న్యాయ‌మూర్తి సంజ‌య్ క‌రోల్ ధ‌ర్మాస‌నం ముందు విచార‌ణ‌ వేయ‌వ‌ద్ద‌ని మెన్ష‌నింగ్ ఆఫీస‌ర్ కి ధ‌ర్మాస‌నం సూచించింది. త‌న బెయిల్ పిటీష‌న్ విచారించేలా హైకోర్టు వెకేష‌న్ బెంచ్ ను ఆదేశించాల‌ని గ‌తంలో సుప్రీంకోర్టులో అవినాశ్ రెడ్డి పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఆ పిటీష‌న్ ను విచార‌ణ తేదీని సుప్రీంకోర్టు ఖ‌రారు చేయ‌లేదు.

CBI Officials : కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో ఎంపీ అవినాశ్ రెడ్డి.. హాస్పిటల్ ముందు సీబీఐ అధికారులు

జూన్ రెండోవారంలో విచార‌ణ‌కు అనుమ‌తిస్తామ‌ని సీజేఐ డివై చంద్ర‌చూడ్ ధ‌ర్మాస‌నం చెప్పింది. ఈ రోజు (సోమవారం) సీబీఐ అరెస్ట్ చేసే అవ‌కాశం ఉన్నందున మ‌ళ్లీ సుప్రీంకోర్టు వెకేష‌న్ బెంచ్ ముందు త‌న బెయిల్ పిటీష‌న్‌ను అవినాశ్‌ మెన్ష‌న్ చేశారు.

హైకోర్టు వెకేష‌న్ బెంచ్ ముందు బెయిల్ పిటీష‌న్ దాఖ‌లు చేసేంత‌వ‌ర‌కూ త‌న‌ను సీబీఐ అరెస్ట్ చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని అవినాశ్‌ సుప్రీంకోర్టును కోరుతున్నారు. రేపు (మంగళవారం) మ‌ళ్లీ సుప్రీంకోర్టు వెకేష‌న్ బెంచ్ ముందుకు వెళ్లాల‌ని అవినాశ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.