CBI Officials : కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో ఎంపీ అవినాశ్ రెడ్డి.. హాస్పిటల్ ముందు సీబీఐ అధికారులు

తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో విచారణకు హాజరు కాలేనని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.

CBI Officials : కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో ఎంపీ అవినాశ్ రెడ్డి.. హాస్పిటల్ ముందు సీబీఐ అధికారులు

Avinash Reddy - CBI officials

MP Avinash Reddy : కర్నూలులో సీబీఐ నోటీసులపై టెన్షన్ వాతావరణం నెలకొంది. సీబీఐ నోటీసులు ఉత్కంఠ రేపుతున్నాయి. కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. నాలుగు రోజులుగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ లో తల్లి వైఎస్ లక్ష్మమ్మ దగ్గర ఉన్నారు. కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ లో వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మమ్మ చికిత్స పొందుతున్నారు.

గుండె నొప్పితో హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. మరోవైపు విశ్వభారతి హాస్పిటల్ కు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు పంపింది. తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో విచారణకు హాజరు కాలేనని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.

YS Viveka Case: సీబీఐకి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరో లేఖ

సీబీఐ విచారణకు రాలేనని వారం రోజులు సమయం కావాలని కోరినట్లు సమాచారం. ఇప్పటికే వివిధ కారణాలతో సీబీఐ విచారణకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కాలేదు. మరోసారి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠత నెలకొంది.