YS Viveka Case: సీబీఐకి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరో లేఖ

వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ నెల 19న సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఆ రోజు కూడా వెళ్లలేదన్న విషయం తెలిసిందే.

YS Viveka Case: సీబీఐకి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరో లేఖ

Avinash Reddy

Avinash Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసులో సోమవారం విచారణకు రాలేనని ఏపీ (Andhra Pradesh) నేత, వైసీపీ (YSRCP) ఎంపీ అవినాశ్ రెడ్డి కేంద్ర దర్యాప్తు బృందానికి (CBI) లేఖ రాశారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని తెలిపారు. తన తల్లి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక విచాణకు వస్తానని చెప్పారు. తనకు 10 రోజుల గడువు ఇవ్వాలని కోరారు. అవినాశ్ విజ్ఞప్తిపై సీబీఐ ఇంకా స్పందించలేదు.

వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ నెల 19న సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఆ రోజు కూడా వెళ్లలేదన్న విషయం తెలిసిందే. ఆయన తల్లికి ఆరోగ్యం బాగోలేదని హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లారు. అవినాశ్ తల్లి ఛాతీ నొప్పితో పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చేరారు.

ఈ నెల 19న అవినాశ్ విచారణకు రాకపోవడంతో ఆయనకు సీబీఐ మరోసారి నోటీసులు పంపి సోమవారం రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అవినాశ్ ఇవాళ సీబీఐకు లేక రాసి రాలేకపోతున్నానని చెప్పారు.

అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే విచారించింది. ఏపీలో వైఎస్ వివేక మృతి కేసుపై రాజకీయంగానూ మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. వివేక మృతి కేసు మొదటి నుంచి ఎన్నో మలుపుతూ తిరుగుతూ వస్తోంది.

YS Viveka Case : సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి .. కార్యాలయం వద్ద భారీ బందోబస్తు.. అరెస్ట్ తప్పదా?