Palnadu Accedent: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ బస్సు-ఆటో ఢీ.. ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం
పల్నాడు (Palnadu Accedent)జిల్లాలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న ఆటోను అత్యంత బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
- V Santhosh Kumar
- Published on- August 27, 2026 / 06:46 AM IST
Fatal road accident in palnadu private bus collides with auto six killed
- పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం
- ఆటోలోని ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం
- ఇద్దరి పరిస్థితి అత్యంత విషమం
Palnadu Accedent: తెలుగు రాష్ట్రాల్లో నిత్యం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. డ్రైవర్ల తీవ్ర నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, రోడ్డు నిబంధనలను పాటించకపోవడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నిన్న సూర్యాపేట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మరణించిన విషాదం మరవకముందే, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో మరో ఘోర రహదారి ప్రమాదం చోటుచేసుకుని ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Telangana Rains: తెలంగాణలో మారిన వాతావరణం.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్!
బస్సు-ఆటో ఢీ: ఆరుగురు ఘటనా స్థలంలోనే మృతి:
పల్నాడు(Palnadu Accedent) జిల్లా చిలకలూరిపేట అడ్డంరోడ్డు సెంటర్ సమీపంలో గురువారం వేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న ఆటోను అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ భయానక ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
పరిస్థితి విషమం – ముమ్మరంగా సహాయక చర్యలు:
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.
