Final Rites : కన్న తండ్రికి తల కొరివి పెట్టిన ఏడేళ్ల బాలిక
కన్నతండ్రి మరణిస్తే తలకొరివి పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఏడేళ్ల చిన్నారి తలకొరివి పెట్టిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది.
- chvmurthy
- Published On : April 20, 2022 / 02:24 PM IST
Dead Body
Final Rites : కన్నతండ్రి మరణిస్తే తలకొరివి పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఏడేళ్ల చిన్నారి తలకొరివి పెట్టిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గుండుగొలనులోని బీసీ కాలనీకి చెందిన వ్యవసాయ కూలీ కాకర్ల శ్రీనివాసరావు(42) అనారోగ్యంతో ఇంటివద్దనే చనిపోయాడు.
అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ప్రియదర్శిని(7) సంజన(5) ఉన్నారు. బంధువులు ఎవరూ శ్రీనివాసరావు అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాకపోవటంతో స్ధానికంగా ఉన్నపెద్దలు పెద్ద కుమార్తె ప్రియదర్శినితో తల కొరివి పెట్టించారు. ఈ దృశ్యాన్నిచూసిన పలువురికి కన్నీళ్లు ఆగలేదు.
Also Read : Weather Warning : తెలంగాణకు చల్లని కబురు
