Anakapalle : అనకాపల్లి జిల్లాలో మరో ప్రమాదం.. నలుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

అనకాపల్లి జిల్లాలో ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసెజ్ లో

Ankapalli Pharma Blast

Anakapalle pharma company explosion : అనకాపల్లి జిల్లాలో ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసెజ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్థలో జరిగిన ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు జార్ఖండ్ వాసులు కాగా.. ఒకరు విజయనగరం వాసిగా గుర్తించారు. వారిలో కే. సూర్యనారాయణ, రోయా అంగిరియా, లాల్ సింగ్ పూర్తి, వైభవ్ కోనలు ఉన్నారు. వీరిలో సూర్యనారాయణది విజయనగరం జిల్లా. అయితే, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Also Read : అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మెరుగైన వైద్యం అందేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులు వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు.

అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక వాడలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 17మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి దాటిన తరువాత జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో రసాయనాలు కలుపుతుండగా ప్రమాదం చోటు చేసుకోవటంతో నలుగురికి గాయాలయ్యాయి.

 

ట్రెండింగ్ వార్తలు