తిరుమల తిరుపతి దేవస్థానంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. టీటీడీ శానిటరీ ఇన్స్పెక్టర్ కి కరీనా పాజిటివ్ వచ్చింది. టీటీడీ అనుబంధ ఆలయమైన గోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారికి కరోనాపాజిటివ్ నిర్ధారణ కావటంతో సహా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
లాక్ డౌన్ తర్వాత టీటీడీ ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గోవింద రాజుల స్వామి గుడి శానిటరీ ఇన్స్పెక్టర్ కు కరోనా రావటంతో తిరిగి ఆలయాన్ని రెండు రోజుల పాటు అంటే నేడు రేపు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
జ్వరం..జలుబు..దగ్గులతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకిందనే అనుమానంతో టెస్ట్ లు చేయగా ఈరోజు టెస్ట్ ల రిజల్ట్స్ రావటంతో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.దీంతో ఆలయం సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈక్రమంలో ఆలయంలోని మిగతా సిబ్బందికి కూడా కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నారు.
ఆలయాన్ని పూర్తిస్థాయి శానిటైజ్ చేశాక ఎల్లుండి నుంచి అంటే ఆదివారం జూన్ 15 నుంచి భక్తులకు తిరగి స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తామంటున్నారు.
Read: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్న అరెస్టు..కారణాలివే..తెలుసుకోవాల్సిన విషయాలు!