Five Girls Missing In Only 10 Days In Anakapalli
andhra pradesh : ఏపీలో ఇటీవల కాలంలో బాలిక అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. ఈక్రమంలో అనకాపల్లి జిల్లా కేంద్రంలో వరుసగా బాలికలు అదృశ్యమవుతున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజుల్లోనే ఐదుగురు బాలికలు కనిపించకుండాపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓ యువతి సహా మరో బాలిక కనిపించకుండాపోవటంతో ఇదేదో బాలిక అక్రమరవాణా మాఫియా చేస్తున్న దారుణాలా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అదృశ్యం అయిన యువతి ఓ షాపులో పనిచేస్తుండేది. ఆమెతో సహా మరో బాలిక కూడా కనిపించకుండాపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటినుంచి బయలుదేరి షాపులో పనికోసం అని వెళ్లి తిరిగి రాలేదని వాపోతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్ అయిన యువతి కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిస్ అయిన కోసం గాలిస్తున్నారు.కాగా..ఏపీలో ఇటీవల కాలంలో అదృశ్యం అవుతున్న బాలిక సంఖ్య పెరుగుతోంది.