Tirupati-Vijayawada: తిరుపతి–విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త విమాన సర్వీసులు ప్రారంభం.. టైమింగ్ డీటెయిల్స్ ఇవే!

తిరుపతి, విజయవాడ(Tirupati-Vijayawada) మధ్య ప్రయాణికులకు అనుసంధానాన్ని పెంచుతూ నూతన విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

Fly91 launches new flight service between Tirupati and Vijayawada.

  • కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
  • వారంలో నాలుగు రోజులు సేవలు
  • తిరుమల భక్తులకు తీవ్ర ఉపశమనం

Tirupati-Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతి, రాజధాని ప్రాంతమైన విజయవాడ మధ్య ప్రయాణికులకు అనుసంధానాన్ని పెంచుతూ నూతన విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఫ్లై-91 (Fly91) విమానయాన సంస్థ ప్రారంభించిన ఈ ప్రత్యేక సర్వీసును గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ, తిరుపతి నగరాల మధ్య నిత్యం ప్రయాణించే వ్యాపారులు, ఉద్యోగులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్లే భక్తులకు అత్యంత వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ కొత్త విమానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

TG Police Recruitment: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు.. కీలక ఉత్తర్వులు జారీ!

వారంలో 4 రోజులు సేవలు.. ప్రయాణ వేళలు, పూర్తి సమాచారం ఇవే:

ఈ నూతన విమాన సర్వీసు వారంలో నాలుగు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ప్రతిరోజూ ఉదయం 8:05 గంటలకు తిరుపతిలో(Tirupati-Vijayawada) బయలుదేరే విమానం ఉదయం 9:15 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9:45 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 10:50 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. కేవలం గంట వ్యవధిలోనే గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు ఉండటంతో బెజవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు తిరుమల యాత్ర మరింత సులభతరం కానుంది.