Ganta Srinivasa Rao
Former Minister Ganta Srinivasa Rao : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు సత్వర న్యాయం జరగాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సూర్యనగర్ యోగ సిద్ధాంజనేయ స్వామి దేవాలయంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా, త్వరగా చంద్రబాబుకు న్యాయం జరగాలని కోరుకుంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో జనసేన నేతలుకూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడారు.ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చంద్రబాబుకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక నేరాల్లో అరెస్టయిన నేరస్థుడు బయట ఉంటే ఏ తప్పు చెయ్యని చంద్రబాబు ఈ వయస్సులో జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జోక్స్ వేశాడు.. చంద్రబాబు అరెస్టు నేను లండన్ లో ఉన్నప్పుడు జరిగింది.. నాకు తెలియదు అంటున్నాడు. ఈ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని గంటా అన్నారు. లండన్ లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా ఇక్కడున్న అధికారులు జగన్ కనుసన్నల్లోనే ఉంటారు. లండన్ లో ఉన్నాకాదా నా మీదకు రాదు అనుకుంటున్నాడు జగన్. ప్రజలు అంత పిచ్చివాళ్లు కాదు జగన్ అంటూ గంటా హెచ్చరించారు.
Vishnu Kumar Raju టీడీపీ- జనసేన పొత్తుపై విష్ణుకుమార్‌రాజు హ్యాపీ.. ఆయన సంబరానికి కారణమేంటి?
స్కిల్ డెవలప్ మెంట్ గుజరాత్ లో స్టడీ చేసి ఏపీలో పెట్టాము. నేను, చంద్రబాబు పెట్టిన ప్రపోజల్‌తోనే స్కిల్ డెవలప్ మెంట్ అమలయిందని గంటా పేర్కొన్నారు. 2020లో జగన్ ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ నెంబర్ వన్‌లో ఉందంటూ ప్రచారం చేశారని గంటా అన్నారు. జగన్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి విజయం ఖాయమని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.