Roja with Jagan (File Photo)
YS Jagan Wedding Anniversary : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి – భారతి దంపతుల పెళ్లి రోజు ఇవాళ. 1996 ఆగస్టు 28న వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు జగన్ – భారతి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి రోజా సెల్వమణి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఏళ్ళన్నీ గడచినా చెదరని మీ అనుబంధం… ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తూ…!! అన్నా వదినలకి హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు’ అంటూ పేర్కొన్నారు. రోజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rk Roja : రోజా సంచలన నిర్ణయం? ఏపీ రాజకీయాలకు గుడ్‌బై, తమిళ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ?
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత రోజా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆమె సొంత కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో రోజా పార్టీ మారుతున్నారని కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. రోజా వైసీపీ పార్టీని వీడబోతున్నారని.. తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తమిళనాట హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం (టీఎంకే) పేరుతో కొత్త పార్టీ పెట్టారు. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను నిలిపేందుకు విజయ్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో రోజా విజయ్ ఏర్పాటు చేసిన పార్టీలో చేరబోతున్నారని కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు రోజా స్పందించలేదు. తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి – భారతి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా రోజా సోషల్ మీడియా వేదికగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో రోజా పార్టీ మార్పుపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లయిందని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
ఏళ్ళన్నీ గడచినా చెదరని మీ అనుబంధం… ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తూ…!! అన్నా వదినలకి హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు ?#weddinganniversary pic.twitter.com/fgsnPKhpkG
— Roja Selvamani (@RojaSelvamaniRK) August 28, 2024