Kethireddy Venkatarami Reddy
Kethireddy: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఒక భావజాలం అంటూ లేదు.. ఇప్పటికీ ఆయన చంద్రబాబు నీడలోనే ఉన్నాడంటూ విమర్శించారు. నేను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితోనే ఉన్నానని.. ఆయన భావజాలంతోనే పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్స్ జగన్ మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ మాత్రమే. అయితే, జగన్ కు రాజకీయంగా జనం వస్తారు.. పవన్ కల్యాణ్ కు మాత్రం సినిమాల పరంగానే జనం వస్తారంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read: వావ్.. రాష్ట్రపతి భవన్లో పెళ్లి.. చరిత్రలో నిలిచిపోతున్న ఈ అమ్మాయి ఫుల్ డిటెయిల్స్..
వైసీపీ ప్రభుత్వం హయాంలో విద్యలో జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దాన్ని ఎవరూ హర్షించలేకపోయారు. చంద్రబాబు మద్యం బాగా ఇస్తే చాలనుకుంటున్నారు. చంద్రబాబు మద్యం ముందు జగన్ ఇచ్చిన విద్య ఓడిపోయింది అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ, జనం మాత్రం సినిమా హీరోల గురించి మాట్లాడుతున్నారు. కొంపలో సమస్యలు పక్కన పెట్టి సినిమా హీరోల వెంట పోతున్నారు. వాళ్లు సినిమాల్లో మాత్రమే హీరోలు.. రియల్ లైఫ్ లో కాదు అంటూ కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కమల్ హాసన్ కంటే పవన్ కల్యాణ్ గొప్ప నటుడు కాదు.. కానీ, కమల్ హాసన్ ఎన్నికల్లో నిలబడితే ఓడిపోయాడు. గతంలో చిరంజీవి రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట మాత్రమే గెలిచారు. బాలక్రిష్ణ హిందూపురం కాబట్టి మూడు సార్లు గెలిచాడు.. అదే గుడివాడలో గెలవమనండి చూద్దాం అంటూ కేతిరెడ్డి అన్నారు. తమిళనాడులో నటుడు విజయ్ కూడా పార్టీ పెట్టాడు. పాలిటిక్స్ అంత ఈజీ కాదు అంటూ కేతిరెడ్డి పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడటంపై స్పందిస్తూ.. పార్టీలో విజయసాయిరెడ్డికి సముచిత స్థానం కల్పించారు. జగన్మోహన్ రెడ్డి పక్కన లేకుంటే విజయసాయిరెడ్డి ఓన్లీ ఆడిటర్ మాత్రమే అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.