Chevireddy Bhaskar Reddy Arrest: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. చెవిరెడ్డితోపాటు అతని మిత్రుడు వెంకటేశ్ నాయుడునుకూడా పోలీసులు అరెస్టు చేశారు.
లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. వెంకటేశ్ నాయుడుతో కలిసి శ్రీలంక దేశానికి వెళ్లేందుకు చెవిరెడ్డి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్లారు. చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడిపై లుక్ అవుట్ సర్క్యూలర్లు ఉండటంతో వారిద్దరినీ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సిట్ అధికారులు వారిని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం వారిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.
లిక్కర్ కుంభకోణంలో కేసులో చెవిరెడ్డి ఏ-38, వెంకటేశ్ నాయుడి ఏ-34గా ఉన్నారు. ఇదిలాఉంటే. ఈ కుంభకోణంలో అరెస్ట్ అయినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది.