10th Class Girls Missing in Visakha : విశాఖలో నలుగురు 10th Class విద్యార్ధినిలు అదృశ్యం .. లేఖలో సంచలన విషయాలు

 విశాఖలోని క్వీన్ మేరీ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్ధినిలు అదృశ్యం అయ్యారు. కనిపించకుండాపోయిన సదరు విద్యార్ధినిలు రాసినట్లుగా భావిస్తున్నఓ లేఖ సంచలనం కలిగిస్తోంది..ఈ లేఖలోని రాసిన సారాంశం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. వారి ఇష్టంతోనే వెళ్లారా? లేదా వారితో ఎవరైనా బలవంతంగా లేఖ రాసి కిడ్నాప్ చేశారా? అని పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు పోలీసులు.

four 10th Class Girls Missing in Visakha : విశాఖలోని క్వీన్ మేరీ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్ధినిలు అదృశ్యం అయ్యారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనంగా మారింది. బుధవారం (నవంబర్ 2,2022) సాయంత్రం నుండి వీరు కనిపించడం లేదని ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు విశాఖ వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు బాలికల మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. విద్యార్ధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీస్, వాలంటీర్ గ్రూపుల్లో విద్యార్థినిల ఫోటోలు షేర్ చేసి వారి ఆచూకీల లభిస్తే వెంటనే చెప్పాలని కోరుతున్నారు. ఈ నలుగురు విద్యార్థినిలు క్వీన్ మేరీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు.

కాగా ఈ నలుగురు విద్యార్థినులు మాయం కావటానికి కారణం వారి నిర్ణయమే అన్నట్లుగా ఉన్న ఓ లేఖ సంచలనం కలిగిస్తోంది. సమాజం పోకడలు తెలిసీ తెలియని వయస్సు..సమాజం పోకడలపై ఎటువంటి అవగాహనా లేని పసి వయస్సు.  విద్యార్థినులు రాసినట్లుగా భావిస్తున్న లేఖలోని సారాంసం చూస్తే ఇదే అర్థమవుతోంది. కేవలం వారి చదివేది 10వతరగతి. కానీ జీవితంలో ఎదగటానికే తాము వెళుతున్నట్లుగా లేఖలో రాయటం చూస్తే వారి అమాయకత్వం ఏంటో తెలుస్తోంది.

కనిపించకుండాపోయిన విద్యార్థినిలు రాసి లేఖగా భావిస్తున్న సారాంశం ఇలా ఉంది: మాకోసం వెతక్కండీ..మేము మా కాళ్లమీద బతకాలి అనే దూరంగా వెళ్లిపోతున్నాం..అంతేతప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనికాదు..మా బతుకు కోసం వెళ్తున్నాం..అలా అని మేము అబ్బాయిలతో వెళ్తున్నాము అని మీరు అనేసుకోవద్దు. మేము పైకి ఎదగటానికి మాత్రమే వెళ్తున్నాం..మాకోసం వెతకొద్దు. మేము ఎక్కడున్నా మీకోసమే ఆలోచిస్తాం. మేము మంచి ‘పొజిషన్’ కు వచ్చాక మేమే మీ దగ్గరకొస్తాం..అంటూ రాసినట్లుగా ఉంది.

మరీ ఈ లేఖను కనిపించకుండా పోయిన విద్యార్ధులే రాశారా? లేక ఎవరైనా రాశారా? లేక వీరితోనే బలవంతంగా రాయించి వారిని కిడ్నాప్ చేశారా? అనే పలు కోణాల్లో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు