కలుషితాహారం తిని నలుగురు విద్యార్థుల మృతి.. చంద్రబాబు, లోకేశ్, జగన్ స్పందన

వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా కోటపురట్ల మండలం కైలాస పట్టణం అనాథాశ్రమంలో కలుషితాహారం తిని జాషువా, భవాని, శ్రద్ధ, నిత్య అనే నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరి కొందరికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ఘటనపై cవిద్యార్థుల మృతి ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, నకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లతో మాట్లాడానని తెలిపారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని కోరుతున్నానని లోకేశ్ అన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే: వైఎస్ జగన్
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు.

చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. తప్పుడు ప్రచారాలు, బురద జల్లుడు కార్యక్రమాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

Also Read: అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం.. విమానాశ్రయం పేరు మారుస్తాం: కేటీఆర్

ట్రెండింగ్ వార్తలు