అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు?

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు ఈ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. చిలమత్తూరు మండలం నల్లబొమ్మలపల్లిలో జరిగిన అత్యాచర ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు ఈ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేపర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు.

నిందితులు హిందూపురానికి చెందిన గంజాయి బ్యాచ్‌కు చెందని వారిగా పోలీసులు గుర్తించారు. ఇంతకు ముందు పలు కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ ఆ నిందితులు బుద్ధి మార్చుకోలేదు. అత్యాచారం కేసుకు సంబంధించి ఇవాళ వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నిందితుల్లో ముగ్గురు యువకులు మైనర్లుగా తెలుస్తోంది.

కాగా, ఉపాధి కోసం కర్ణాటకలోని బళ్లారి నుంచి వలస వచ్చిన అత్తాకోడలిని నలుగురు నిందితులు కత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఏపీ మంత్రులు అన్నారు.

Video: సినిమాను తలపించే సీన్.. అగ్నిలో తగలబడుతూ రోడ్డుపై దూసుకెళ్లిన కారు