ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

  • Publish Date - July 20, 2020 / 11:18 PM IST

చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ ఆర్ పురం మండలం చిన్నతయ్యూరులో నివాసముంటన్న సుధాకర్, సింధుప్రియ భార్యభర్తలు. వీరికి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. అయితే దంపతుల మధ్య గొడవ జరిగింది. సుధాకర్ భార్యతో గొడవపడ్డాడు. భార్య క్షిణాకావేశంలో తన ఇద్దరు పిల్లలను తీసుకుని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషయం తెలుసుకున్న భర్త సుభాకర్ బావిలో ఆ దృశ్యాన్ని చూసి మనస్తాపానికి గురై, భయంతో తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరణించిన వారిలో చిన్నారులుండటంతో ఆ దృశ్యాన్ని చూసి అందరూ కూడా చలించిపోయారు. అందరూ కంటతడి పెట్టుకున్నారు.

నలుగురి మృతితో గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను సమీపంలో ఉన్న పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు