Guntur Nri Hospital
Guntur NRI Hospital : గుంటూరు జిల్లా ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో గ్రూప్ తగాదాలు రచ్చకెక్కాయి. ఎన్ఆర్ఐ యాజమాన్యం రెండు వర్గాలుగా చీలిపోవడంతో సుమారుగా రూ.1500 కోట్ల విలువైన ఆస్తులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఆసుపత్రి విక్రయానికి ఒక వర్గం సిద్ధమైతే మరొక గ్రూప్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆసుపత్రిలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఎన్ఆర్ఐ అకాడమీ గవర్నింగ్ బాడీ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో గ్రూప్ తగాదాలు, నిధుల వ్యవహారంపై చర్చిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించారు.