×
Ad

Ganta Srinivasa Rao: భవిష్యత్తులో ఏపీని శాసించేది కాపులే -గంటా

రాబోయే రోజుల్లో కాపు సామాజికవర్గమే రాజకీయాలను శాసిస్తదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

  • Published On : December 20, 2021 / 08:50 PM IST

Ganta Srinivasa Rao: రాబోయే రోజుల్లో కాపు సామాజికవర్గమే రాజకీయాలను శాసిస్తదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సభలో మాట్లాడిన గంటా.. ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాబోయే రోజుల్లో కాపులు ఏకమవ్వాలని పిలుపునిచ్చిన గంటా సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ అయ్యాయి.

రాష్ట్ర రాజకీయాలకు కాపులే కీలకం కానున్నారని కూడా గంటా అన్నారు. కాపుల బలోపేతానికి ఎప్పుడూ కృషి చేస్తానని కూడా ఈ సంధర్భంగా గంటా అన్నారు.

భవిష్యత్తులో ఏపీని శాసించేది కాపులేనని అన్నారు. వివిధ పార్టీల్లో ఉన్న కాపు సామాజికవర్గ నేతలందరూ ఈ కార్యక్రమానికి రాగా.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.