Student Suicide Attempt : అంబేదర్క్ కోనసీమ జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం

అంబేదర్క్ కోనసీమ జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. మండపేట శశి స్కూల్ లో ఐదో అంతస్తు పైనుంచి దూకేందుకు ప్రయత్నించిందో బాలిక.

Student Suicide Attempt : అంబేదర్క్ కోనసీమ జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. మండపేట శశి స్కూల్ లో ఐదో అంతస్తు పైనుంచి దూకేందుకు ప్రయత్నించిందో బాలిక. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది చాకచక్యంగా బాలికను కాపాడారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఆ విద్యార్థిని శశి స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. స్కూల్ బిల్డింగ్ 5వ అంతస్తు పైకి ఎక్కి సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎంతో రిస్క్‌ చేసి విద్యార్థినిని కాపాడారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఎప్పుడేం జరుగుతుందోనని కంగారుపడ్డారు. అయితే, ఆ విద్యార్థినిని పోలీసులు కాపాడటంతో అంతా రిలాక్స్ అయ్యారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతోనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయబోయిందని తెలుస్తోంది. స్కూల్ సిబ్బంది, పోలీసులు విద్యార్థిని వద్దకు వెళ్లి మార్కుల విషయంలో సముదాయించారు. చాకచక్యంగా ఆమెను పట్టుకుని కిందకు దించేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పిల్లలు మరీ సెన్సిటివ్ గా తయారవుతున్నారు. తల్లిదండ్రులు మందలించారనో, టీచర్ తిట్టిందనో, మార్కులు తక్కువ వచ్చాయనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో.. ఇలా చిన్న చిన్న వాటికే మనస్తాపం చెందుతున్నారు. ఆవేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. బలవనర్మణాలకు పాల్పడుతున్నారు. చక్కగా చదువుకోవాల్సిన వయసులో పిల్లల్లో ఈ విపరీత ప్రవర్తన తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. చావు సమస్యకు పరిష్కారం కాదని, మార్కులే జీవితం కాదని పిల్లలకు వివరించాలి. పరీక్షల్లో ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చినా నష్టమేమీ లేదని, మరింత పట్టుదలగా చదివేలా వారిలో ధైర్యం నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, టీచర్ల మీద ఉంది.

ట్రెండింగ్ వార్తలు