Pawan Kalyan (Photo : Twitter)
Pawan Kalyan – Pithapuram : జనసేనకు అధికారం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓటర్లను అభ్యర్థించారు. అధికారంలోకి వచ్చాక తన పనితీరును చూడాలన్నారు. ఒకవేళ రెండేళ్ల పాటు తన పని తీరు, అధికారం నచ్చకపోతే.. తానే రాజీనామా చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు రైతులు, చేనేత కళాకారుల ఆత్మీయ సమావేశంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
” కుల రాజకీయాలకు మేము స్వస్తి చెప్తాం. సమస్యలు చెబుతున్నారు తప్ప ఎలక్షన్ టైమ్ లో వదిలేస్తున్నారు. చీరాలలో నేను చేనేత కుటుంబాల మధ్య పెరిగాను. దశాబ్దాలుగా ప్రతికూల పరిస్థితుల్లో పట్టు రైతులు ఉన్నారు.
ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో జనసేనను గెలిపించండి. దేశం మొత్తం చూసేలా పిఠాపురంను చేస్తాము. పదేళ్లు జనసేనకి అధికారం కట్టబెట్టండి. రెండేళ్లు నా అధికారము నచ్చకపోతే నేనే రాజీనామా చేస్తాను.
ప్రలోభాలు దాటి జనసేనను గెలిపించండి. దళితులు నా మేనమామ అన్నవాడు అంబేద్కర్ విదేశీ విద్య తీసేశాడు. జనసేన ప్రజా ప్రతినిధులను అసెంబ్లీకి పంపించండి. వచ్చే ఎన్నికల్లో మోసగాళ్ళ మాటలు నమ్మకండి. అమ్మఒడి ఇచ్చి నాన్న జేబు ద్వారా డబ్బులు లాగేసుకుంటున్నారు” అని పవన్ ధ్వజమెత్తారు.