ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వానికి గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎమ్ బీ) లేఖ రాసింది. గోదావరి నదిపై తెలంగాణ కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తుందన్న ఏపీ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసింది. కాళేశ్వరం, దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలు, ఫిర్యాదు కాపీని జతపరుస్తూ తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరికి లేఖ రాశారు.
గోదావరి నదీ జలాల విషయంలో కొత్త మలుపు తీసుకుంటోంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం 203 జీవోతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కృష్ణా నీటి యాజమాన్య బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం
తాజాగా తెలంగాణ ప్రభుత్వం.. కృష్ణా నదితోపాటు గోదావరి నదిపై కూడా అక్రమంగా కొత్త ప్రాజెక్టులు కడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల వల్ల దిగువనున్న ఏపీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనికి సబంధించి డీపీఆర్ రిపోర్టును తీసుకొని నిలువరించాలని నదీ యాజమాన్య బోర్డులను కోరింది.
దీనికి సంబంధించి నిన్న కృష్ణా నీటి యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్ లు కూడా ఇవ్వాలని కోరింది. తాజాగా గోదావరి నీటి యాజమాన్య బోర్డు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టులతోపాటు రామప్ప ప్రాజెక్టులు సంబంధించి డీపీఆర్ లు కూడా ఇవ్వాలని కోరింది.
కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సీడబ్ల్యుసీకి ఇప్పటికే పూర్తి డీపీఆర్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా మళ్లీ గోదావని నది యాజమాన్యం బోర్డు డీపీఆర్ అడగటం ఆశ్చర్యకరంగా ఉందని తెలంగాణ నీటి పారుదల నీటి శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మున్ముందు సంబంధించి మరోసారి డీపీఆర్ లు ఇవ్వాలా లేదా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ మాదిరిగానే వివరణ ఇచ్చి ఫర్దర్ గా ముందుకెళ్లాలా అని చెప్పి తెలంగాణ అధికారులు భావిస్తున్నారు.