Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?
దేశ వ్యాప్తంగా సోమవారం ఉదయం నమోదైన ధరలను పరిశీలిస్తే.. బంగారం ధర స్వల్పంగా పెరగ్గా, వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
- Harishth Thanniru
- Published On : September 18, 2023 / 07:24 AM IST
Gold Price
Gold And Silver Prices Today: పండుగల సీజన్ ప్రారంభమైంది. మహిళలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని బంగారం దుకాణాలు రద్దీగా కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సోమవారం ఉదయం నమోదైన ధరలను పరిశీలిస్తే.. బంగారం ధర స్వల్పంగా పెరగ్గా, వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. 10గ్రాములు 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10మేర పెరిగింది.
Gold
బులియన్ మార్కెట్‌లో సోమవారం ఉదయం 6గంటల వరకు నమోదైన ధరల వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,910 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,900కి చేరింది.
Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే..
-దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ. 55,060 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,050కు చేరింది.
– ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,910 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,900కి చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 55,310కి చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ. 60,330కు చేరింది.
– బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,910 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 59,900కు చేరింది.
– కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 54,910 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,900కి చేరింది.
Gold
దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 78,200 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 74,700, చెన్నైలో రూ. 78,200, ముంబయిలో రూ. 74,700, కోల్‌కతాలో 74,700, బెంగళూరులో కిలో వెండిపై రూ. 250 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రూ. 73250 వద్ద కొనసాగుతుంది.
