Gone Prakash Rao : సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన గోనె ప్రకాశ్ రావు

చంద్రబాబు చరిత్ర తెలియకుండా జగన్ మాట్లాడటం సరైంది కాదు.. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయినప్పుడు జగన్ డైపర్లు వేసుకుంటున్నాడని గుర్తుచేసుకోవాలని గోనె ప్రకాశ్ రావు సూచించారు.

Gone Prakash Rao

Former MLA Gone Prakash Rao : సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఓ పిరికి పంద అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సజ్జల వలన జగన్ మునిగిపోతున్నాడు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. సజ్జల లాంటి వ్యక్తి సలహాలతో జగన్ కు తీవ్ర నష్టం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి ఏపీలో 151 సీట్లు దాటినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఏపీలో జగన్ కు ప్రతిపక్ష హోదాకూడా దక్కదు. క్రిస్లియన్, మైనార్టీలు ఓటర్లు కాంగ్రెస్ వైపు వెళ్తారు.. ఎన్నికల తరువాత జగన్ శాసనసభకు రాడంటూ గోనె వ్యాఖ్యానించాడు.

Also Read : AP Budget 2024 : రూ.2.86లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. పూర్తి వివరాలు ఇలా..

బీజేపీ పొత్తు వలన.. టీడీపీ, జనసేన కూటమికి బలం పెరుగుతుందని చెప్పిన గోనె ప్రకాశ్.. చంద్రబాబు చరిత్ర తెలియకుండా జగన్ మాట్లాడటం సరైంది కాదన్నారు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయినప్పుడు.. జగన్ డైపర్లు వేసుకుంటున్నాడని గుర్తుచేసుకోవాలని సూచించారు. ఏపీలో వైసీపీ చిత్తుగా చిత్తుగా ఓడిపోతోందని అన్ని సర్వేలు చెప్తున్నాయని, మంత్రులు రోజా, విడుదల రజనీకి కూడా జగన్ టికెట్ ఇవ్వడు. కొత్త ఇంచార్జుల్లో 35 మంది వరకు జగన్ బీఫాం ఇవ్వడని గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : Chandrababu Delhi Tour : ఢిల్లీకి చంద్ర‌బాబు నాయుడు.. పొత్తుల‌పై రానున్న క్లారిటీ!

తల్లి, చెల్లి పట్ల జగన్ వ్యవహరిస్తోన్న తీరును.. దేవుడు కూడా క్షమించడని గోనె ప్రకాశ్ రావు అన్నారు. హత్య కాదు.. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయనటానికి జగనే ఉదాహరణ. షర్మిల వలన కాదు.‌. జగన్ను నమ్ముకున్న తెలంగాణ నేతలు రోడ్డున పడ్డారు . జగన్ను నమ్ముకున్న కొండా సురేఖ రాజకీయంగా నష్టపోయింది. జగన్ను వదిలేయటం వలనే ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, పువ్వాడ అజయ్, పుట్ట మధు, బాజిరెడ్డి, సంజీవరావులు రాజకీయంగా కుదురుకున్నారు . సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని జైలు నుంచి జగన్ బయటకు వచ్చాడు . రిలయన్స్ పై దాడులు చేసి అదే రిలయన్స్ వ్యక్తి పరిమళ్ కు రాజ్యసభ ఇచ్చాడు. తండ్రిని చంపిన వారితో జగన్ డబ్బులకోసం ఒప్పందాలు చేసుకున్నాడు . స్వార్థంకోసం దగ్గర బంధువు సునీల్ ఎవరో తెలియదన్న వ్యక్తి జగన్ అంటూ గోనె ప్రకాశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు