Good Morning Cm Sir Flower Plants Are Visible On The Road Know What Is The Matter
Good Morning Cm Sir : ఏపీ రాష్ట్రంలో వర్షాల కారణంగా రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ మొదటి రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలిగిరి జనసైనికులు పాల్గొన్నారు. భారీ వర్షాలతో అధ్వాన్నంగా మారిన రోడ్లకు సంబంధించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు సీఎం జగన్‌కు తెలిసేలా జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపు మేరకు #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్‌తో డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టారు జనసైనికులు.
#GoodMorningCMSir pic.twitter.com/9VYlpiQTT5
— Pawan Kalyan (@PawanKalyan) July 15, 2022
#GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్‌కు విశేష స్పందన వస్తోంది. శుక్రవారం (జూలై 15) ఉదయం 8 గంటలకు పవన్ కోనసీమలో కొత్తపీట దగ్గర రోడ్డు ఛిద్రమై వీడియోను పోస్టు చేశారు. #GoodMorningCMSir అనే నినాదంతో అధ్వాన్నంగా మారిన వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. కోనసీమలో కొత్తపేట దగ్గర రోడ్డు ఛిద్రమై ఉన్న వీడియోను పోస్ట్ చేసి #GoodMorningCMSir అని ట్యాగ్ చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేక వ్యంగ్య చిత్రాన్ని ట్వీట్ చేశారు. అప్పటి నుంచి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. తొలి రెండు గంటల్లోనే ట్రెండింగ్‌లో ట్వీట్స్ మొదలైన అగ్రస్థానానికి చేరింది.
#GoodMorningCMSir pic.twitter.com/SmVloBOsV4
— Pawan Kalyan (@PawanKalyan) July 15, 2022
తొలి రోజున 3.55 లక్షల ట్వీట్స్ వచ్చాయి. తద్వారా రాష్ట్రంలోని నలుమూలల నుంచీ గతుకులమయమై నరకప్రాయంగా ఉన్న రోడ్లను చెప్పే ఫోటోలను, వీడియోలను పోస్టు చేశారు. ఈ ట్వీట్స్ 218 మిలియన్ల మందికి చేరువైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతోపాటు యువత భారీగా పాల్గొన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం మండపేట నియోజకవర్గంలో మండపేట నుంచి కోరుమిల్లి, కపిలేశ్వరపురం వెళ్ళే రోడ్డులోని గోతులను చూపిస్తూ ట్వీట్ చేశారు. కోరుమిల్లి – జొన్నాడ రోడ్డునీ, కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం-కాకినాడ ప్రధాన రోడ్డు దుస్థితిపై ఆయన ట్వీట్స్ చేశారు.
Ream Also : GoodMorningCMSir: సర్కస్ ఫీట్లు కాద్సార్..!! ఏపీలో రోడ్ల దుస్థితిపై పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు..