GoodMorningCMSir: సర్కస్ ఫీట్లు కాద్సార్..!! ఏపీలో రోడ్ల దుస్థితిపై పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు..

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ మూడు రోజులపాటు తలపెట్టిన #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో ఏపీలో రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

GoodMorningCMSir: సర్కస్ ఫీట్లు కాద్సార్..!! ఏపీలో రోడ్ల దుస్థితిపై పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు..

#goodmorningcmsir

GoodMorningCMSir: ఏపీలో వైసీపీ సర్కార్ పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు లేవంటూ మండిపడుతున్నారు. గత కొద్దిరోజులుగా ఏపీలో రోడ్ల దుస్థితిపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. తాజాగా భారీ వర్షాలు పడుతుండడంతో చాలాచోట్ల రోడ్లు మరింత దారుణంగా తయారయ్యాయని జనసైనికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఏపీలోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా #Good Morning CM Sir పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ మూడు రోజులపాటు తలపెట్టిన #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ట్విట్టర్లో 1, 2 స్థానాల్లో కొనసాగుతోంది. క్యాంపెయిన్ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే 1.66 లక్షల ట్విట్లు రావడం విశేషం. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని ఫోటోలు, వీడియోల ద్వారా #GoodmorningCMSir హ్యాష్ ట్యాగ్ తో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేలా ప్రయత్నం చేస్తున్నారు. ట్విట్టర్ తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల మీదా #GoodMorningCMSir ట్రెండింగ్ జోరు కనిపిస్తోంది.

శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ ఏపీలోని రోడ్ల దుస్థితిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్లు చేశారు. #Good Morning CM Sirతో ఓ వీడియోను పవన్ తన ట్విటర్ లో పోస్టు చేశారు. ఆ వీడియోలో రోడ్డుపై అడుగుకో గుంత కనిపిస్తుంది. మరో ట్వీట్ లో కార్టూన్ రూపంలో రాష్ట్రలో రోడ్ల దుస్థితిని పవన్ తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇందులో ‘ సర్కస్ ఫీట్లు కాద్సార్.. మన ప్రజలే..! ఆఫీసులకు, పన్ల మీద బయటకెళ్తున్నారు’ అంటూ రాశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు తమ ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితిని తెలుపుతూ రీట్వీట్లు చేస్తున్నారు.