Tirumala Virtual Seva Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. 16న వర్చువల్ సేవా టికెట్ల‌ కోటా విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. డిసెంబర్ నెల‌కు సంబంధించి వర్చువల్ ఆర్జిత సేవా టికెట్ల కోటాను నవంబర్ 16న ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.

Tirumala Virtual Seva Tickets : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకి శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ నెల‌కు సంబంధించి వర్చువల్ ఆర్జిత సేవా టికెట్ల కోటాను నవంబర్ 16న ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. ఇందులో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన వర్చువల్ సేవ‌, సంబంధిత దర్శన టికెట్లు ఉంటాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇప్పటికే డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 దర్శన కోటాను టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. కోటా విడుదలైన 80 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారు. డిసెంబర్ నెల టికెట్ల కోటాను అక్టోబర్ లోనే విడుదల చేయాల్సి ఉండగా.. వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని డిసెంబర్‌ నెల నుంచి మార్పు చేయాలని టీటీడీ నిర్ణయానికి రావడంతో స్లాట్ల సర్దుబాటులో భాగంగా జాప్యం జరిగింది.

ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా 5,06,600 టికెట్లను వివిధ స్లాట్లలో టీటీడీ విడుదల చేయగా.. నిమిషాల వ్యవధిలోనే బుక్ అయిపోయాయి.

ట్రెండింగ్ వార్తలు