Somu Veeraju-PVN Madhav : ఛార్జీషీటు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన : బీజేపీ నేతలు

అసెంభ్లీ స్ధాయిలో నిర్వహించే ఛార్జిషీట్ల దాఖలుకు నేతలు సిద్ధమవ్వాలన్నారు. ప్రతి జిల్లాకు ముఖ్య అతిధిలుగా రాష్ట్ర, జాతీయ నేతలను పంపిస్తామని చెప్పారు.

Somu Veeraju-PVN Madhav

Somu Veeraju-PVN Madhav : వైసీపీ ప్రభుత్వంపై బీజీపీ ముప్పేట దాడి చేస్తోంది. ఛార్జిషీట్ల దాఖలు పేరుతో అభియోగ పత్రాల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. శక్తి కేంద్రాల్లో పర్యటించిన బీజేపీ నేతలకు ప్రజల నుంచి ఫిర్యాదుల వెల్లువ వచ్చింది. ఛార్జిషీటుపై బీజేపీ నేతలతో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ చేపట్టిన ఛార్జీషీటు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.

అసెంభ్లీ స్ధాయిలో నిర్వహించే ఛార్జిషీట్ల దాఖలుకు నేతలు సిద్ధమవ్వాలన్నారు. ప్రతి జిల్లాకు ముఖ్య అతిధిలుగా రాష్ట్ర, జాతీయ నేతలను పంపిస్తామని చెప్పారు. మే12,13,14 తేదీలలో అసెంభ్లీస్ధాయిల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న పాట్లను వివరించాలని పేర్కొన్నారు. అబద్దపు హామీలతో మోసం చేసిన వైనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

AP Ministers : రైతుల నుంచి ఎలాంటి రుసుము లేకుండా మిల్లర్లు ధాన్యం తీసుకోవాలి : మంత్రులు

అసెంభ్లీ స్ధాయిలో ఛార్జిషీట్ నమోదులో బీజీపీ లీగల్ సెల్ సభ్యులకు బాధ్యతలు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అప్పుడే మెరుగైన విధంగా ఛార్జిషీట్ ఫార్మెట్ ప్రకారం చేసే వీలు కలుగుతుందన్నారు. అసెంభ్లీ స్ధాయిలో ప్రభావంతమైన ఆరోపణలతో కూడిన ఛార్జిషీట్ తయారు కావాలని సూచించారు. అన్ని జిల్లాల్లో బీజేపీ ఛార్జిషీటు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.