AP Ministers : రైతుల నుంచి ఎలాంటి రుసుము లేకుండా మిల్లర్లు ధాన్యం తీసుకోవాలి : మంత్రులు

రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు.

AP Ministers : రైతుల నుంచి ఎలాంటి రుసుము లేకుండా మిల్లర్లు ధాన్యం తీసుకోవాలి : మంత్రులు

AP Ministers

AP Ministers : రైతుల నుంచి ఎలాంటి రుసుము లేకుండా మిల్లర్లు ధాన్యం తీసుకోవాని.. లేదంటే చర్యలు తీసుకుంటామమని ఏపీ మంత్రులు హెచ్చరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం ఎలా ఉన్నా సరే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ 10రోజుల్లోనే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రూ.530 కోట్లు వారి అకౌంట్లో జమ చేశామని తెలిపారు. ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే ప్రభుత్వమని వెల్లడించారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో రైతులను మంత్రులు పరామర్శించారు. గ్రామంలో తడిసిన ధాన్యాన్ని మంత్రులు పరిశీలించారు.

Nara Lokesh : యువగళం పాదయాత్ర దెబ్బకి రోడ్డు మీదికి వస్తోన్న వైసీపీ దొంగల బ్యాచ్ : నారా లోకేశ్

రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు స్పందిస్తే అధికారులు స్పందించారు అంటున్నారు, వ్యవసాయానికి ఇబ్బంది వస్తే జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తాడని తెలిసే చంద్రబాబు హడావుడి చేస్తున్నాడని పేర్కొన్నారు.