Nara Lokesh : యువగళం పాదయాత్ర దెబ్బకి రోడ్డు మీదికి వస్తోన్న వైసీపీ దొంగల బ్యాచ్ : నారా లోకేశ్

జగన్ జీవితం అంతా గోల్ మాల్ అని, ఆయన ఏ స్కీమ్ ప్రవేశ పెట్టినా అందులో గోల్ మాల్ ఉంటుందని విమర్శించారు. అందుకే జగన్ కు గోల్ మాల్ జగన్ అని పేరు పెట్టానని తెలిపారు.

Nara Lokesh : యువగళం పాదయాత్ర దెబ్బకి రోడ్డు మీదికి వస్తోన్న వైసీపీ దొంగల బ్యాచ్ : నారా లోకేశ్

Nara Lokesh

Nara Lokesh : యువగళం పాదయాత్ర దెబ్బకి వైసీపీ దొంగల బ్యాచ్ అంతా రోడ్డు మీదకి వస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. లోకేష్ ని అడ్డుకుంటాం అంటూ సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా చచ్చిన శవాలు కూడా సవాళ్లు విసరడం వింతగా ఉందన్నారు. ‘అడ్డుకోవడానికి ఎంత మంది వచ్చినా మేము రెడీ…తన్నులు తినడానికి మీరు రెడీనా?’ అని లోకేశ్ సవాల్ చేశారు. అబద్దానికి మానవ రూపం జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ కు ఒక శాపం ఉంది.. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలు అవుతుంది… అందుకే ఆయన ఎప్పుడూ అబద్దాలే చెబుతాడు అని లోకేశ్ అన్నారు.

జగన్ జీవితం అంతా గోల్ మాల్ అని, ఆయన ఏ స్కీమ్ ప్రవేశ పెట్టినా అందులో గోల్ మాల్ ఉంటుందని విమర్శించారు. అందుకే జగన్ కు గోల్ మాల్ జగన్ అని పేరు పెట్టానని తెలిపారు. టీడీపీ హయాంలో ఉన్న 1100 రియల్ టైం గవర్నెన్స్ ని జగన్ నిర్వీర్యం చేశాడని, పేరు మార్చి స్పందన అని పేరు పెట్టాడని ఎద్దేవా చేశారు. స్పందనలో ఎన్ని అర్జీలు పెట్టినా స్పందన లేదన్నారు. ఇప్పుడు దాని పేరు జగన్ కి చెబుదాం అని మార్చి కొత్త డ్రామా మొదలు పెట్టాడని విమర్శించారు.

Nara Lokesh: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అవినీతిలో తోపు: నారా లోకేశ్

తనకు ఆరు సమస్యలు ఉన్నాయని గోల్ మాల్ జగన్ కి చెప్పేదాం.. ఎప్పుడు పరిష్కరిస్తాడో చూద్దామని లోకేశ్ అన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.. ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారని.. నాలుగేళ్లు గడిచిపోయాయని..ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? అని ప్రశ్నించారు. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ ప్రసంగించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం తడిచిన ధాన్యం కొనాలని, ఎప్పటిలోగా కొంటారని నిలదీశారు. బీసీల్లో ఉన్న ఉప కులాలకు నిధులు కేటాయిస్తామన్నారు.. బీసీలకు చెందాల్సిన డబ్బులు ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు కేటాయించిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని.. ఎప్పటి లోగా వాటిని తిరిగి ప్రారంభిస్తారని ప్రశ్నించారు. 2019లో నందికొట్కూరు ఎమ్మెల్యే గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ధర్ ని భారీ మెజారిటీతో గెలిపించారని.. ఒక్క దళితుడి జీవితం అయినా మారిందా? అని అన్నారు.

Nara Lokesh : వైఎస్ జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసిరిన నారా లోకేశ్.. జగన్ ఎలా స్పందిస్తారో..

ఎమ్మెల్యేనే రోడెక్కి హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్థర్ కు ఆర్డర్ వేసే అధికారాలు లేవన్నారు. జగన్ పాలనలో దళితులకు జరుగుతున్న అవమానం చూడాలంటే నందికొట్కూరు రావాలన్నారు. నందికొట్కూరుని వైసీపీ నాయకులు భూ కబ్జాలు, అక్రమ మద్యం, ల్యాండ్ సెటిల్ మెంట్స్ కి అడ్డాగా మార్చేశారని విమర్శించారు. నందికొట్కూరులో ఉన్న ఎన్టీఆర్ జలాశయాన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారని ఫైర్ అయ్యారు. రూ.2 కోట్లు విలువ చేసే భూమి కొట్టేశారని, జలాశయాన్ని పూడ్చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు.

నందికొట్కూరులోని బ్రహ్మం గారి మఠం సమీపంలో 22 ఎకరాల భూమిని సెంటు స్థలాల కోసం ఎకరా రూ.5 లక్షలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎకరా రూ.60 లక్షలకు అమ్మాలని వైసీపీ నేతలు పెద్ద స్కెచ్ వేశారని ఆరోపించారు. టీడీపీ నాయకుల పోరాటంతో అది ఆగిందని తెలిపారు. 4వే రోడ్డులో పోయిన సుమారు 75 సెంట్ల మున్సిపాలిటీ స్థలాన్ని ప్రయివేట్ స్థలంగా చూపించి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము కొట్టేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని విమర్శించారు.

Nara Lokesh : వైసీపీపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారు : నారా లోకేశ్

జూపాడుబంగ్లా గ్రామంలో సర్వే నంబర్ 711-2 లో భూమిని వైసీపీ నేతలు కొట్టేశారని, టీడీపీ హయాంలో గోకులంకి కేటాయించిన భూ మిని కబ్జా చేశారని పేర్కొన్నారు. ఆఖరికి అంగన్వాడీ స్థలాన్ని కూడా కబ్జా చేశారని వెల్లడించారు. ముబారక్ షాదీఖానా పక్కనున్న 20 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేసి అమ్మేశారని ఆరోపించారు. వైసీపీ నేతలు తెలంగాణ నుండి లిక్కర్ తెచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ అమ్ముతున్నారని విమర్శించారు.

నందికొట్కూరుని అభివృద్ధి చేసింది టీడీపీ అని స్పష్టం చేశారు. రూ.1200 కోట్లతో నందికొట్కూరు నియోజకవర్గంలో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు.. వంటి అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. రూ.300 కోట్లతో ముచ్చుమర్రి లిఫ్ట్ 17 నెలల్లో పూర్తి చేసి కేసీ కాలువ, హంద్రీనీవాకు కృష్ణా జలాలు అందించింది టీడీపీ అని పేర్కొన్నారు. జగన్ పాదయాత్రలో భాగంగా నందికొట్కూరు వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారని తెలిపారు.

CM Jagan-Nara Lokesh : వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌ ‘ఆ మూడు పాయింట్ల’తోనే.. నారా లోకేశ్ సెటైర్లు

అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు – గుంటూరు (కేజీ) రోడ్డు విస్తరణ, ఆధునీకరణ చేస్తానని జగన్ హామీ ఇచ్చారని, నాలుగేళ్లు అయినా దిక్కు లేదని ఎద్దేవా చేశారు. మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అన్ని మండలాల్లోని లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తాం.. శ్రీశైలం నీటి ముంపు వాసులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు..కానీ ఏ ఒక్కటి హామీని అమలు చేయలేదని విమర్శించారు.