Nara Lokesh : వైసీపీపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారు : నారా లోకేశ్
జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చని.. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నది అనుమానమేనని టీడీపీ నారా లోకేష్ అన్నారు. ఎమెల్సీ ఎన్నికల్లో తమకు వైసీపీ వాళ్ళే ఓట్లు వేశారని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకే పార్టీలో దిక్కులేదని ఎద్దేవా చేశారు.

Nara Lokesh : జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చని.. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నది అనుమానమేనని టీడీపీ నారా లోకేష్ అన్నారు. ఎమెల్సీ ఎన్నికల్లో తమకు వైసీపీ వాళ్ళే ఓట్లు వేశారని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకే పార్టీలో దిక్కులేదని ఎద్దేవా చేశారు. వైసీపీపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారని పేర్కొన్నారు. పార్టీలో కష్టపడిన వారికి భవిష్యత్తులో ప్రాధాన్యం ఉంటుందన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా ఓడీసీలో విలేకర్లతో నారా లోకేశ్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రులు అంటే పోరాడే మనస్తత్వం విడవకూడదని చెప్పారు.
జగన్ పాదయాత్రలో 600 హామీలు ఇచ్చారని కానీ.. మేనిఫెస్టోలో కొన్నింటినే పేర్కొన్నారని తెలిపారు. తిరుమలలోనూ విచ్చలవిడిగా గంజాయి సరఫరా అవుతోందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత చాలా ఇబ్బందులు పడుతోందని చెప్పారు. ఒక్క ఇంట్లో ఇద్దరు నిరుద్యోగులున్నారని వెల్లడించారు. ఈ విషయం పై కేంద్రానికి లేఖ రాశానని గుర్తు చేశారు. టమోటా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మామిడి రైతులకి మార్కెటింగ్ సమస్య ఉందని చెప్పారు. పరిశ్రమలు పుట్టపర్తి జిల్లాలో పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉందని తెలిపారు.
పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న జగన్ పట్టించు కోవడం లేదని విమర్శించారు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని బాగా డ్యామేజ్ చేశాడని చెప్పారు. జగన్ దిగిపోయే వరకు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారని ఆరోపించారు. రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో తెలియడం లేదన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు సరిగా పడడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగులు జగన్ ను సీపీఎస్ అడగడం లేదని.. జీతం వస్తే చాలు అనుకుంటున్నారని తెలిపారు.