CM Jagan-Nara Lokesh : వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌ ‘ఆ మూడు పాయింట్ల’తోనే.. నారా లోకేశ్ సెటైర్లు

CM Jagan- Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని సమాచారం. జగన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ నేత.. నారా లోకేశ్ సెటైర్లు వేశారు.

CM Jagan-Nara Lokesh : వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌ ‘ఆ మూడు పాయింట్ల’తోనే.. నారా లోకేశ్ సెటైర్లు

CM Jagan- Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని సమాచారం. జగన్ ఢిల్లీ టూర్ పై ప్రస్తుతం యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న టీడీపీ నేత.. నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా లోకేశ్ జగన్ టూర్ పై మూడు పాయింట్లతో సెటైర్లు వేశారు. అయినను పోయి రావలె హస్తినకు అంటూ ప్రారంభించిన లోకేశ్.. అయిననూ పోయి రవలె హస్తినకు అని జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీ ఎందుకువెళ్లినట్లు అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాజీ మంత్రి, జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ..ఒక కన్నుని పొడిచి మరో కన్నును కాపాడటానికి, రెండు సీబీఐ అధికారి బదిలీ కోసం మూడోది లిక్కర్ స్కామ్ లో బుక్ అయిన ఎంపీ కోసం అంటూ ట్వీట్ చేశారు.

కాగా వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈకేసులో అవినాశ్ రెడ్డి నిందితుడుగా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సీబీఐ విచారణకు వెళ్లారు. మరోసారి వెళ్లాల్సి ఉంది. దీంతో అవినాశ్ రెడ్డి..తనను పదే పదే విచారణకు పిలవకుండా సీబీఐకు ఆదేశాలివ్వాలని..అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్టును కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ విచారణకు హాజరుకావాల్సిందేనంటూ తేల్చి చెప్పింది.

అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎంపీ మాగుంటు కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా విచరాణకు రావాలని ఆదేశిస్తూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇలా ఒక ఎంపీ హత్య కేసులోను..మరో ఎంపీ లిక్కర్ స్కామ్ కేసులోను ఇరుక్కోవటంతో వారి కోసం జగన్ ఢిల్లీ పెద్దలను బతిమాలుకోవటానికి వెళ్లారని లోకేశ్ సెటైర్లు వేశారు.

అలాగే టీడీపీ నేత దూళిపాళ నరేంద్ర కుమార్ కూడా జగన్ ఢిల్లీ టూర్ పై సెటైర్లు వేశారు. జగన్ ఇంత ఆకస్మికంగా ఢిల్లీ పర్యటన ఎందుకు వెళ్లారంటూ నాలుగు అంశాలను ప్రస్తావించారు ధూళిపాళ.బాబాయ్ కేసులో కంగారుపడి, ఎంపీ అరెస్టుపై కలవరపడి, కొత్త నోటీసులకు భయపడి.. గూగుల్ టేకౌటుకు తత్తరపడి అంటూ ధూళిపాళ కామెంట్లు చేశారు.