Indian Railway: ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. ఆ రూట్‌లో పలు రైళ్లు రద్దు

గూడ్స్ రైలు పట్టాలు తప్పి రైల్వే‌ట్రాక్ స్వల్పంగా దెబ్బతినడంతో విశాఖ - విజయవాడ రూట్‌లో ఆరు రైళ్లను రద్దు చేశారు. వాటిల్లో జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.

Goods Train Derailed

Indian Railway: అనకాపల్లి జిల్లా (Anakapalli District) లో గూడ్స్ రైలు (Goods Train ) పట్టాలు తప్పింది. తాడి – అనకాపల్లి స్టేషన్ల ( Thadi – Anakapalli stations)  మధ్య బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు బుధవారం తెల్లవారు జామున 3.35 గంటల సమయంలో పట్టాలు తప్పింది. ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో విశాఖపట్టణం – విజయవాడ మార్గంలో కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Indian Railway : భారత్‌లోని ఆ రైల్వే ట్రాక్‌‌కు ఇప్పటికి బ్రిటిష్ ప్రభుత్వానికి రైల్వే శాఖ అద్దె కడుతోందా..?!

గూడ్స్ రైలు పట్టాలు తప్పి రైల్వే‌ట్రాక్ స్వల్పంగా దెబ్బతినడంతో విశాఖ – విజయవాడ రూట్‌లో ఆరు రైళ్లను రద్దు చేశారు. వాటిల్లో జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. అదేవిధంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. విశాఖ పట్టణం నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ రైలు ఉదయం 8.45కి బయలుదేరింది. మరికొన్ని రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మరోవైపు గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న ట్రాక్‌కు మరమ్మతు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.