Gorantla Madhav: తెలంగాణలో బర్రెలక్క మీద గెలవలేని వాళ్లు ఇప్పుడు ఇక్కడికొచ్చి..: ఎంపీ గోరంట్ల మాధవ్

కర్నూలు జిల్లాలో గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో..

kuruva gorantla madhav

YSRCP: తెలంగాణలో బర్రెలక్క మీద గెలవలేని వాళ్లు ఇప్పుడు ఏపీకి వచ్చి గెలుస్తామంటున్నారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. తెలంగాణలో బర్రెలక్క మీద గెలవలేదు కానీ.. ఏపీలో వైఎస్ జగన్ మీద చంద్రబాబు, పవన్ గెలుస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

కర్నూలు జిల్లాలో గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని, ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఏపీని చంద్రబాబు సర్వనాశనం చేశారని అన్నారు. ఓటుకు నోటుకు ఇప్పిస్తూ చంద్రబాబు దొరికిపోయారని విమర్శించారు.

ఆ కేసులో నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రభుత్వ యంత్రాంగాన్ని మార్చారన్నారు. ప్రజలకు షూరిటీ ఇస్తానంటున్న చంద్రబాబు జైలుకు వెళ్లడం గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. ఎమ్మిగనూరు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న వ్యక్తి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నేకేశవ రెడ్డి అని అన్నారు. ఆయన వెంటే ప్రజలు ఉన్నారని చెప్పారు.

RGV Comments on Pawan Kalyan : పవన్ కల్యాణ్‌పై RGV సంచలన వ్యాఖ్యలు