Cm Chandrababu: ఇక చెప్పడాల్లేవ్.. ఓన్లీ యాక్షనే..! ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసినట్లేనా..?
ఇంకో పదిహేనేళ్లు మనమే పవర్‌లో ఉండాలి. రాష్ట్ర పురోగతికి బలమైన పునాది వేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అందుకే మీరు బాధ్యతతో పని చేయండి.
- Naveen
- Updated on- May 23, 2026 / 08:36 PM IST
- చూస్తూ ఊరుకునేది లేదు..ఇక నుంచి నో వార్నింగ్స్.!
- గ్రేస్ పీరియడ్ ఓవర్..ఇక దూకుడు పెంచాలని ఆదేశం
- ఇక చెప్పడాలేం ఉండవు..యాక్షనే అంటూ హెచ్చరిక
- పార్టీ, ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తెస్తే ఊరుకోమన్న బాబు
Cm Chandrababu: పవర్‌లోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచి ఒకటే మాట. బాధ్యతగా పని చేయండి. మళ్లీ గెలిచి రావాలన్న విషయం మర్చిపోకండి. వన్ టైమ్ ఎమ్మెల్యేగా ఉండిపోతామంటే మీ ఇష్టం. సరిగ్గా పని చేయకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటానంటూ ఎమ్మెల్యేలకు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. అయినా పలువురు ఎమ్మెల్యేల తీరు ఏ మాత్రం మారడం లేదట. దీంతో ఇదే ఫైనల్ అంటూ ఎమ్మెల్యేలకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఇలాగైతే మిమ్మల్ని మోయలేం అని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ టర్మే కాదు. ఇంకో పదిహేనేళ్లు మనమే పవర్‌లో ఉండాలి. రాష్ట్ర పురోగతికి బలమైన పునాది వేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అందుకే మీరు బాధ్యతతో పని చేయండి. ప్రజల్లో ఉండండి అంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు డే వన్ నుంచి దిశానిర్ధేశం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. లేటెస్ట్‌గా ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి నో వార్నింగ్స్. నో ఎక్స్‌క్యూజెస్. చూస్తూ ఊరుకునేది లేదు. సరిగ్గా నడుచుకోకపోతే వేటే అంటూ తేల్చి చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఎలా.? మీ తీరుతో పార్టీని, ప్రభుత్వాన్ని రోడ్డున పడేస్తూ పోతున్నారని ఫైర్ అయ్యారు. లైన్ దాటితే మరో ఆలోచన లేకుండా సస్పెండ్ చేస్తానని..ఇక మీరే తేల్చుకోండి అంటూ ఎమ్మెల్యేలకు ఆ మధ్య గట్టిగా ఇచ్చిపడేశారు సీఎం చంద్రబాబు. పార్టీనే ఫస్ట్, మళ్లీ పవర్‌లోకి రావడమే టార్గెట్..అంటూ తేల్చి చెప్పిన చంద్రబాబు..ఎమ్మెల్యేల, నేతల తీరుపై ఓపెన్ డయాస్ మీదే అసహనం వ్యక్తం చేసి చర్చకు దారితీశారు.
ఇక చెప్పడం ఉండదు.. చేతలే..
ఇలాగైతే మిమ్మల్ని మోయలేం. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా..గ్రౌండ్ లెవల్‌లో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకుంటే ప్రజల్లో నెగెటివిటీ వస్తుంది. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలే దీనికి నిదర్శనం అంటూ మరోసారి ఎమ్మెల్యేల తీరుపై సీరియస్ అయ్యారట చంద్రబాబు. మాట వినని ఎమ్మెల్యేలకు తెగేసి చెప్పిన ఆయన..గ్రేస్ పీరియడ్ కూడా ముగిసింది..ఇక చెప్పడం ఉండదు..చేతలే అంటూ తేల్చి చెప్పారట. రెండేళ్లుగా చెబుతూ వస్తున్నా..తీరు మార్చుకోకపోతే తాను చేయగలిగిందేమీ లేదన్న బాబు..మరోసారి ఒకరిద్దరు ఎమ్మెల్యేల తీరుపై నేతల దగ్గర ప్రస్తావించారట. ఇటీవల కావలి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని కార్యకర్తల ఎదుటే స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారట. ఇకనైనా పనితీరు మార్చుకుంటే సరి. లేకుంటే చెప్పడాలు..బుజ్జగించడాలు ఉండవని కుండబద్దలు కొట్టేశారట.
తమిళనాడు, కేరళ, బెంగాల్ ఎన్నికలే ఎగ్జాంపుల్..
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోయాయి. బెంగాల్‌లో శాంతిభద్రతల వైఫల్యం..అధికార పార్టీ నేతల అరాచకాలను ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అభివృద్ధిపరంగా బాగా చేసినా ఎమ్మెల్యేల అవినీతి ఆ పార్టీ ఓటమికి కారణమైంది అంటూ ఎగ్జాంపుల్స్‌తో సహా చెప్పారట. ఆ మూడు రాష్ట్రాల్లో ప్రజల తీర్పును అర్థం చేసుకుని పనితీరును చక్కదిద్దుకుంటే 2029 ఎన్నికల్లో కూటమి గెలుపును ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారట. పార్టీ లైన్ దాటి పనిచేసే వారు తమను తాము సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పారట. తీరా ఎన్నికలు వచ్చాక టికెట్ ఇవ్వట్లేదని..నియోజకవర్గ ఇంచార్జ్‌గా తప్పించారని బాధపడి ప్రయోజనం ఉండదని కూడా చెప్పేశారట. తప్పు చేసినా మోస్తానని మాత్రం అనుకోవద్దని స్పష్టం చేశారట సీఎం చంద్రబాబు.
అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో దాదాపు పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఏదో ఒక ఇష్యూతో పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టారు. ఎమ్మెల్యే ఆదిమూలం, కొలికపూడి శ్రీనివాస్, చదలవాడ అరవిందబాబు, కాకర్ల సురేష్ ఇలా పలువురు టీడీపీ ఎమ్మెల్యే తీరు..వారిపై వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఇక పలుచోట్ల తెలుగు తమ్ముళ్లు..టీడీపీ ఎమ్మెల్యేతో పాటు..జనసేన ఎమ్మెల్యేలతో కోల్డ్ వార్‌కు దిగుతుండటంపై కూడా చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. అందరినీ కవర్ చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ఇకపై పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేల తీరు మారకపోతే కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తారన్న ఇండికేషన్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. లేటెస్ట్ హెచ్చరికతో అయినా ఎమ్మెల్యేల తీరు మారుతుందో..కొందరు ఎమ్మెల్యేలకు హ్యాండ్ ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడుతాయో చూడాలి.
Also Read: 3 పార్టీలు.. 4 సీట్లు.. చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి?
