Tdp Mlas: ఒకరి తర్వాత మరొకరు.. చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినా మారని ఎమ్మెల్యేల తీరు.. ఎందుకిలా?
పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఇష్యూనే కదా ఏం కాదు అనుకుంటే కుదరదు అంటూ పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రజాప్రతినిధుల బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. జనం మన ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారన్న విషయం గుర్తూ చేస్తూనే ఉన్నారు.
- Naveen
- Published on- April 27, 2026 / 11:52 PM IST
- ఒకరి తర్వాత మరొకరు..ఎమ్మెల్యేలు ఎందుకిలా?
- ఎమ్మెల్యేల అనుచరుల హల్‌చల్‌కు కారణమేంటి.?
- సమస్యలు కొని తెచ్చుకుని వివాదంలో చిక్కుకుంటున్నారా?
- అనవసర విషయాల జోలికి ఎందుకు వెళ్తున్నట్లు?
Tdp Mlas: ఒకరి తర్వాత మరొకరు. ఒక ఇష్యూ తర్వాత మరో రచ్చ. ఎమ్మెల్యేలే కాంట్రవర్సీకి తెరలేపుతున్నారో..లేక వివాదాలే వాళ్లను వెతుక్కుంటూ వస్తున్నాయో తెలియదు కాని.. ప్రతి నెల రోజులకో ఎమ్మెల్యే తీరు ఇష్యూ అవుతోంది. టీడీపీ అధినేతకు హెడెక్ అవుతోంది. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలి ఎందుకు మారడం లేదు? సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినా ఎమ్మెల్యేలు..వారి అనుచరులు ఇరకాటంలో పడటానికి రీజనేంటి?
పర్సనల్ లైఫ్ వేరు. పబ్లిక్ లైఫ్ చాలా సున్నితమైంది. ప్రజా జీవితంలో ఉన్న నేతలు..వారి చుట్టున్న వాళ్లు చిన్న మిస్టేక్ చేసిన పెద్ద రచ్చ అవుతోంది. పొలిటికల్ లైఫే తలకిందులైన సందర్భాలు ఉన్నాయి. అందుకే చేసే ప్రతీ..మాట్లాడే ప్రతీ మాట ఎంతో ముఖ్యం. రాజకీయ నాయకులు అయితే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్. ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది. దూకుడే పేరు తెచ్చి పెట్టినా..ఆ దూకుడు స్వభావమే నట్టేట ముంచొచ్చు. సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్..హై థింకింగ్‌కు అలవాటు పడిన వారికే బెటర్ పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందన్నది..సీనియర్ లీడర్లను చూస్తే అర్థమవుతోంది. ఎమ్మెల్యేలు సరిగ్గా ఉంటే సరిపోదు..వారి కుటుంబ సభ్యులు, అనుచరులు, సిబ్బంది అందరి ప్రవర్తన లెక్కలోకి వస్తుంది. చివరకు ఎమ్మెల్యేతో ఫోటో దిగిన వ్యక్తి ఏదైనా తప్పు చేసి దొరికినా..అది ఆ ప్రజాప్రతినిధి మెడకు చుట్టుకోవడం ..ఆయన సమాధానం చెప్పుకునే పరిస్థితులకు దారితీస్తుంది.
ఏ పొలిటికల్ లీడర్ అయినా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే..తాము చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారని. అది పబ్లిక్ మీటింగ్‌లో కావొచ్చు. రోడ్డు మీద కావొచ్చు. ఎక్కడైనా ప్రవర్తన చాలా ముఖ్యం. ఎప్పుడూ ఏ రూపంలో వివాదంలో చిక్కుకోవాల్సి వస్తుందో చెప్పలేమ్. ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా..ఎక్కడ తమ బిహేవియర్ డిఫరెంట్‌గా కనిపించినా..మీడియా, సోషల్ మీడియా చెడుగుడు ఆడేస్తుంది. ఆ తర్వాత ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా..ఎన్ని కవర్ డ్రైవ్‌లు చేసినా డ్యామేజ్ కంట్రోల్ అవడం కష్టం. ఒక ఎమ్మెల్యే చేసే మిస్టేక్ ఆయనకే పరిమితం కాదు. ఓవరాల్ పార్టీకి బ్యాడ్‌నేమ్ తెస్తున్న పరిస్థితి.
వివాదంలో కల్యాణదుర్గం ఎమ్మెల్యే..
టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో సీన్ మరోలా ఉంది. ఎప్పుడూ ఎవరో ఒక ఎమ్మెల్యే వివాదాల్లో చిక్కుకోవడం..సీఎం చంద్రబాబు సీరియస్ అవడం కామన్ అయిపోయింది. అందరిదీ ఒక కథ అయితే..కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎపిసోడ్ సమ్‌థింగ్ డిఫరెంట్. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయిన సురేంద్రబాబుకు నియోజకవర్గంలో మంచి పేరే ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆయన ఎలాంటి కాంట్రవర్సీలు, అనవసర విషయాలకు జోలికి వెళ్లరని చెప్తున్నారు. కానీ టోల్ ప్లాజా ఎపిసోడ్‌లో ఆయన అనుచరులు చేసిన వీరంగం పెద్ద రచ్చ అయింది. చివరకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు రియాక్ట్ అయి కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించే వరకు వచ్చింది.
డ్యామేజ్ కంట్రోల్ కోసం చంద్రబాబు చర్యలు..
టోల్ గేట్ దగ్గర ఏం జరిగింది.. తప్పు ఎవరిదన్న విషయం పక్కన పెడితే జరగాల్సిన ఇష్యూ జరిగింది. టీడీపీ, కూటమి ప్రభుత్వంపై విమర్శలు రావడం..డ్యామేజ్ కంట్రోల్ కోసం చర్యలు తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. అయినా చర్చకు, విమర్శకు అవకాశం ఇచ్చినట్లు అయింది. ఇక్కడ ఎమ్మెల్యే విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేకున్నా..ఆయన ముందే టోల్ గేట్ సిబ్బందిపై అనుచరులు దాడి చేశారన్న వార్తలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
సీఎం చంద్రబాబు పదేపదే ఎమ్మెల్యేలకు సూచిస్తున్నది ఇదే. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఇష్యూనే కదా ఏం కాదు అనుకుంటే కుదరదు అంటూ పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రజాప్రతినిధుల బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. జనం మన ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారన్న విషయం గుర్తూ చేస్తూనే ఉన్నారు. అయినా అక్కడక్కడ ఎమ్మెల్యేలు..పొరపాటుగానో..కావాలనో రచ్చకెక్కడం, ఇష్యూకు తెరలేపడం రెగ్యులర్ అయిపోయింది. అనవసర విషయాలు, కాంట్రవర్సీల్లో వేలు పెడుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే పలుసార్లు సీరియస్ అయిన సీఎం చంద్రబాబు..ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు నాటికి కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
Also Read: ఎకరం కేవలం 99 పైసలే.. విశాఖలో ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
