Visakha Infosys Campus: ఎకరం కేవలం 99 పైసలే.. విశాఖలో ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే ప్రభుత్వ చర్యల్లో భాగంగా భూమి కేటాయింపు జరిగింది. 2029 జనవరి నాటికి ఫేజ్-1 పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Visakha Infosys Campus: విశాఖలో ఇన్ఫోసిస్ ఐటీ క్యాంపస్‌కు 20 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లిఫ్ట్ పాలసీ కింద కేవలం ఎకరం 99 పైసలకే కేటాయించింది ప్రభుత్వం. రూ.750 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాజెక్ట్ ప్రతిపాదన చేసింది ఇన్ఫోసిస్. 7 వేల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ఇన్ఫోసిస్ ప్రణాళిక రచించింది. ఎండాడ హిల్‌లో ఐటీ/ఐటీఈఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది ఇన్ఫోసిస్.
విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే ప్రభుత్వ చర్యల్లో భాగంగా భూమి కేటాయింపు జరిగింది. 2029 జనవరి నాటికి ఫేజ్-1 పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ప్రాజెక్ట్ 6 ఏళ్లలో పూర్తి కానుంది. గ్రీన్ క్యాంపస్ కోసం ప్రభుత్వం 100% గ్రీన్ ఎనర్జీ సరఫరా చేయనుంది. మెట్రో కనెక్టివిటీకి దగ్గరలోని మెట్రో స్టేషన్ ఉండేలా ప్రభుత్వం ద్వారా ప్రణాళికకు హామీ ఇచ్చింది. అంతేకాదు రోడ్లు, నీరు, విద్యుత్ సహా పూర్తి మౌలిక వసతులు కల్పనకు కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఏపీఐఐసీ ద్వారా రూ.79 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది కూటమి సర్కార్.
Also Read: ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతకు అసలు కారణం ఇదే.. అందుకే ఈ కష్టాలు..!?
