గల్లా జయదేవ్ మళ్లీ మనసు మార్చుకున్నారా, సీఎం చంద్రబాబు ఏం ఆఫర్ చేశారు?

తన కంపెనీలు, కార్మికుల భవిష్యత్‌ కోసం వెనక్కి తగ్గిన గల్లా... డేర్‌ చేస్తే ఇప్పుడు వేరే లెవెల్‌లో ఉండేవారని అంటున్నారు గల్లా అనుచరులు.

Gossip Garage : పొలిటీషియన్‌ కం ఇండస్ట్రయలిస్ట్‌… అమరరాజా ఇండస్ట్రీస్‌ అధినేత గల్లా జయదేవ్‌ పొలిటికల్‌ ఫ్యూచర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా మారుతోంది…. రాజకీయాలకు తాత్కాలిక విరామమంటూ గత ఎన్నికలకు ముందు పొలిటికల్‌ స్క్రీన్‌పై నుంచి తనకు తానుగా ఎగ్జిట్‌ అయిన గల్లా…. ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకున్నారా? రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా… మూడోసారి గెలిచే అవకాశం ఉన్నా…. పాలిటిక్స్‌కు దూరమంటూ రాంగ్‌ డిసిషన్‌ తీసుకున్నానని తర్జనభర్జన పడుతున్నారా? ఆయన ఇంట్రెస్ట్‌ను గుర్తించిన సీఎం చంద్రబాబు ఏం ఆఫర్‌ చేశారు?

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తానని చంద్రబాబు ఆఫర్‌..
గుంటూరు మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత గల్లా జయదేవ్‌ పొలిటికల్‌ ఫ్యూచర్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్వతహాగా పారిశ్రామిక వేత్త అయిన గల్లా జయదేవ్‌ గత ప్రభుత్వంలో తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురవ్వడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలా ప్రకటించిన మూన్నెల్లలోనే ఎన్నికలు జరగడం… టీడీపీ తిరుగులేని విజయం సాధించడంతో గల్లా జయదేవ్‌లో అంతర్మథనం మొదలైందని టాక్‌ వినిపిస్తోంది. ఎన్నికల్లో తెరవెనుక రాజకీయం చేసిన జయదేవ్‌… పార్టీ అధికారంలోకి రాగానే ఢిల్లీలో చాలా హంగామా చేయడంతో ఆయనకు పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ తగ్గలేదని తేలిపోయింది. ఆయన హడావుడి చూసిన వారంతా గల్లా మళ్లీ రీఎంట్రీ ఇస్తారా? అనే డౌట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేశారు. ఇక ఆయన ఆసక్తిని గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తానని ఆఫర్‌ చేసినట్లు చెబుతున్నారు.

డేర్‌ చేసుంటే ఇప్పుడు వేరే లెవెల్‌లో ఉండేవారు..
రెండు సార్లు ఎంపీగా పనిచేసిన గల్లా… మూడోసారి పోటీ చేస్తే కచ్చితంగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యేవారని… కానీ, ఆయన తొందరపాటు వల్ల చాన్స్‌ మిస్సయ్యారని టాక్‌ వినిపిస్తోంది. తన కంపెనీలు, కార్మికుల భవిష్యత్‌ కోసం వెనక్కి తగ్గిన గల్లా… డేర్‌ చేస్తే ఇప్పుడు వేరే లెవెల్‌లో ఉండేవారని అంటున్నారు గల్లా అనుచరులు. ఐతే అదంతా గతం కనుక… బాధపడి ప్రయోజనం లేదని భావిస్తున్న గల్లా… నెక్ట్స్‌ స్టెప్‌పై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

మళ్లీ యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి రావాలని దాదాపు నిర్ణయం..
రాజకీయ కుటుంబానికి చెందిన గల్లా జయదేవ్‌కు తన సొంత ప్రాంతం చిత్తూరు జిల్లాలోనూ… ఎంపీగా పని చేసిన గుంటూరులోనూ మంచి పలుకుబడి, పరపతి ఉన్నాయి. పార్టీలోనూ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌ వద్ద గుర్తింపు ఉండటం వల్ల మళ్లీ యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి రావాలని దాదాపు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాలపై జయదేవ్‌ ఆసక్తిని గమనించి అధినేత చంద్రబాబు కూడా ఆయనను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆయన స్థాయికి తగ్గట్టు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి హోదా ఇవ్వాలని నిర్ణయించారంటున్నారు. ఐతే ఈ పదవి వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు దూరమయ్యే అవకాశం ఉండటం వల్ల ఢిల్లీ పోస్టు తీసుకోవాలా.. వద్దా.. అనే మీమాంసను ఎదుర్కొంటున్నారట జయదేవ్‌.

రాజ్యసభకు వెళ్లడమే బెటర్‌ అనే ఆలోచన..
పదేళ్లపాటు ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్‌కు ప్రజాసమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి ఏం అవసరమో ఆయనకు తెలుసు.. అందుకే ఢిల్లీలో ఆయన లాంటి వారు ఉండాలని సీఎం నిర్ణయించారంటున్నారు. అయితే జయదేవ్‌ మాత్రం అధినేత అంతరంగానికి తగ్గట్టుగా మరో రూపంలో సేవలు అందించాలని అనుకుంటున్నారట. గుంటూరు ఎంపీ స్థానాన్ని వదులుకోవడం… కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరులో పర్మినెంట్‌ అయ్యే అవకాశాలు ఉండటంతో మళ్లీ లోక్‌సభకు వెళ్లే పరిస్థితి లేదని డిసైడ్‌ అయ్యారట గల్లా. ప్రత్యామ్నాయంగా విజయవాడ, విశాఖ పార్లమెంట్‌ స్థానాలపై ఫోకస్‌ చేద్దామన్నా… ఆ రెండు చోట్ల పార్టీకి బలమైన నేతలు ఎంపీలుగా ఉండటంతో తాను రాజ్యసభకు వెళ్లడమే బెటర్‌ అనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. రాజ్యసభకు వెళ్లడం ద్వారా అధినేత చంద్రబాబు అకాంక్షలను నెరవేర్చడంతోపాటు చట్టసభలో అడుగుపెట్టాలనే తన ఆశయం ఫలిస్తుందని జయదేవ్‌ భావిస్తున్నారట.

ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండాలనే ఒత్తిడి చేస్తున్న చంద్రబాబు..
ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప, ప్రజా సమస్యలపై స్పందించే అవకాశం ఉండదని భావిస్తున్న మాజీ ఎంపీ జయదేవ్‌… రాజ్యసభ ఎన్నికల వరకు వెయిట్‌ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈలోగా పరిశ్రమ విస్తరణ పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ఇక గల్లా జయదేవ్‌ వంటి సమర్థులు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, రాయితీలను రాష్ట్రానికి తెప్పించుకోవచ్చని భావిస్తున్న సీఎం చంద్రబాబు.. ఆయనను ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండాలనే ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు.

మొత్తానికి టీడీపీలో ఇన్నర్‌ పాలిటిక్స్‌ పరిశీలిస్తే గల్లా జయదేవ్‌ పొలిటికల్‌ రీఎంట్రీ ఖాయమనే టాక్‌ వినిపిస్తోంది. ఇందుకు జయదేవ్‌ కూడా సానుకూలంగా ఉండటంతో ఆయన సేవలను ఎలా వాడుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు ఢిల్లీలో అధికార ప్రతినిధి అవుతారా? లేక జయదేవ్‌ ఆశిస్తున్నట్లు రాజ్యసభలో అడుగుపెడతారా? అన్నది చూడాల్సివుంది.

 

ట్రెండింగ్ వార్తలు