Sharmila Gvl Representative Image (Image Credit To Original Source)
Ys Sharmila: పెద్దల సభ రేసు. ఎవరి ఈక్వేషన్స్ వాళ్లవి. ఒకరు ఏపీ నుంచి ఖాళీ అయ్యే సీట్లలో బెర్త్ కోసం ట్రై చేస్తుంటే..మరొకరు పెద్దల సభలో అడుగు పెట్టి ఏపీలో చక్రం తిప్పాలని స్కెచ్ వేస్తున్నారట. జాతీయ నేతలను కలుస్తూ..ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట. కానీ ఆ ఇద్దరు రాజ్యసభలో అడుగుపెట్టేందుకు..వాళ్ల పార్టీల్లో పరిస్థితుల్లో అంత ఈజీగా లేవట. ఇంతకు ఎవరా ఇద్దరు నేతలు.? వాళ్లు పెద్దల సభకు వెళ్లకుండా ఏర్పడుతున్న అడ్డంకులు ఏంటి.?
మరో మూడు నెలల తర్వాత ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లపై ఇప్పటినుంచే ఆసక్తికర రేసు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 73 సీట్లు ఖాళీ కానుండటంతో ఏపీకి చెందిన పలు పార్టీల నేతలు లాబీయింగ్‌ను స్పీడప్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు మాత్రమే ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి బీజేపీకి దక్కే అవకాశం ఉండటంతో..బీజేపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు..రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి బీజేపీలో పలుకుబడి కలిగిన నాయకుడిగా ఉన్న జీవీఎల్ నరసింహారావు..కేంద్ర బడ్జెట్‌పై విస్తృత ప్రచారం చేసేందుకు..దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్ బాధ్యతల్లో ఉన్నారు. ఇదే సమయంలో రాజ్యసభ సీట్లు ఖాళీ కానుండటంతో..పెద్దల సభ బెర్త్‌పై పెద్ద ఆశలే పెట్టుకుంటున్నారట జీవీఎల్.
జాతీయ పార్టీ ఆయన సేవలను మరింతగా వినియోగించుకోవాలనుకుంటే ఛాన్స్ ఇవ్వొచ్చని అంటున్నారు. ఏపీ కోటాలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో బీజేపీ వాటాగా దక్కే ఒక సీటుని జీవీఎల్‌కు ఇస్తారని టాక్. ఆయనకు అవకాశం ఇస్తే..ఏపీలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందన్న ఈక్వేషన్స్ కూడా ఉన్నాయట. అదే జరిగితే జీవీఎల్ మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చినట్లే అని అంటున్నారు.
2024 ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని జీవీఎల్ భావించినా ఆ సీటు పొత్తులో టీడీపీకి వెళ్లింది. ఇప్పుడు రాజ్యసభ ఛాన్స్ ఇస్తే జీవీఎల్‌కు రాజకీయంగా దశ తిరిగినట్లే అని అంటున్నారు. అయితే కూటమి నేతలతో జీవీఎల్‌కు ఉన్న సంబంధాల మీదే డిస్కషన్స్ జరుగుతున్నాయ్. అటు సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌తో సహా ఏపీ బీజేపీ నేతలతో కూడా జీవీఎల్‌కు పెద్దగా చెప్పుకోదగ్గ సాన్నిహిత్యం లేదంటున్నారు. బీజేపీ పెద్దలు ఫిక్స్ అయితే మాత్రం జీవీఎల్‌కు బెర్త్ పక్కా అన్న టాక్ వినిపిస్తోంది.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల కూడా పెద్దల సభలో రేస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఆమె 2024 జనవరిలో ఏపీ పీసీసీ చీఫ్‌గా పదవిని చేపట్టి..రెండేళ్లుగా ఆ పోస్ట్‌లో కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్ బలోపేతం కోసం వైఎస్ షర్మిల చేసిన ప్రయత్నాలు ఏవీ పెద్దగా ఫలించలేదు. ఆమెతో పొసగక..కాంగ్రెస్ సీనియర్లు సైలెంట్ అయిపోయారు. వైసీపీ నుంచి ఎవరూ కాంగ్రెస్ వైపు రావడం లేదు. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం పేరు మార్పుపై పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు షర్మిల. జిల్లాల పర్యటనకు కూడా సిద్ధమవుతున్నారు.
ఈ మధ్యే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన షర్మిల ఏపీలో పార్టీ పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. అయితే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. ఈ మధ్యలో ఒకటి రెండు సార్లు రాజ్యసభకు సీట్లు ఖాళీ అయినా షర్మిలకు బెర్త్ దక్కలేదు. పలువురు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలే షర్మిలకు దక్కిన హామీ నెరవేరకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అయితే రాజ్యసభలో 73 సీట్లు ఖాళీ అవుతున్నా కాంగ్రెస్‌కు దక్కేది తక్కువే అంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి 27 సీట్లు ఉన్నాయి. 73 మంది సభ్యులు పదవీ విరమణ చేయనుండటంతో ఆ పార్టీకి ఇంకా సీట్లు తగ్గనున్నాయి. పైగా పదవీ విరమణ చేస్తున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వంటి వారిని తిరిగి కొనసాగించాల్సి ఉంది. ఖర్గేను తెలంగాణ కోటా రాజ్యసభకు పంపిస్తారని ఇన్ సైడ్ టాక్. అయితే కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఈ మూడూ స్టేట్స్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో ఏడు సీట్లు ఇక్కడ ఖాళీ అవుతున్నాయి. ఇందులో కాంగ్రెస్‌కు ఐదు కచ్చితంగా వస్తాయి.
మహారాష్ట్ర, తమిళనాడు, అసోం వంటి చోట్ల కలుపుకుంటే ఒకటి, రెండు సీట్లు దక్కే అవకాశం ఉంది. కర్నాటక లేకపోతే తెలంగాణ కోటాలో షర్మిలను రాజ్యసభకు పంపించే అవకాశం ఉందట. అయితే తెలంగాణ, కర్నాటక నుంచి రాష్ట్రాల పెద్దల సభలో అడుగుపెట్టేందుకు చాలామంది రేసులో ఉండటంతో షర్మిలకు రాజ్యసభ సీటు దక్కడం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కనుక షర్మిలకు ఇచ్చినట్లు చెబుతున్న హామీని నిలబెట్టుకోవాలనుకుంటే..ఆమెకు రాజ్యసభ బెర్త్ పక్కా అన్న ప్రచారం జరుగుతోంది. అయితే అటు జీవీఎల్, ఇటు షర్మిల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.
Also Read: మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతోంది, ఇక మీరెందుకు? జనసేన నేతలపై పవన్ కల్యాణ్ ఫుల్ సీరియస్