జనసేన లీడర్లకు పవన్ ఫుల్ క్లాస్.. సీరియస్ గా మీటింగ్ మధ్యలోనే..
వైసీపీ నేతల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వాళ్ల ట్రాప్ లో పడొద్దని హెచ్చరించారు. మిమల్ని, మీ కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
- తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఒక్కరూ ఎందుకు మాట్లాడరు
- వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్టడం లేదు
- వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్త
Pawan Kalyan: జనసేన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతలపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫుల్ సీరియస్ అయ్యారు. పార్టీ నేతలకు ఫుల్ క్లాస్ తీసుకున్నారు పవన్ కల్యాణ్. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఒక్కరు కూడా మాట్లాడటం లేదని పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్టడం లేదని పార్టీ నేతలను ప్రశ్నించారు. అన్నింటికీ నేనే మాట్లాడితే ఇక మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకు..? అని పవన్ నిలదీశారు.
వైసీపీ నేతల ట్రాప్ లో పడొద్దు..
అదే సమయంలో వైసీపీ నేతల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వాళ్ల ట్రాప్ లో పడొద్దని హెచ్చరించారు. మిమల్ని, మీ కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సిద్ధాంత పరంగా, సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్. అదే సమయంలో వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పవన్ హెచ్చరించారు.
అందరి చిట్టా నా దగ్గరుంది..
మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతోంది అంటూ నేతలపై పవన్ సీరియస్ అయ్యారు. అందరి చిట్టా నా దగ్గర ఉందని అన్నారు. ఆ తర్వాత ఆగ్రహంతో సమావేశం నుండి వెళ్ళిపోయారు పవన్ కల్యాణ్. ఏం చేస్తారు అనేదానిపై రిపోర్ట్ ఇవ్వాలని నాదండ్ల మనోహర్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు పవన్ కల్యాణ్.
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఎంతటి దుమారం రేపుతుందో తెలిసిందే. అరవ శ్రీధర్ పై ఓ మహిళ చేసిన వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. దీన్ని వైసీపీ తమ అస్త్రంగా చేసుకుంది. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది. మహిళల రక్షణ గురించి మాట్లాడే పవన్ కల్యాణ్.. అరవ శ్రీధర్ వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తోంది.
Also Read: కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం- కూటమి నేతలకు సజ్జల వార్నింగ్
