Allu Arvind : హీరోయిన్లా ఉన్నావు.. సినిమాలో నటిస్తావా? స్టేజిపై యాంకర్‌కి ఆఫర్ ఇచ్చిన అల్లు అరవింద్.. వీడియో వైరల్..
ఈ ఈవెంట్ కి నిర్మాత అల్లు అరవింద్ గెస్ట్ గా హాజరయ్యారు.(Allu Arvind)
Allu Arvind
Allu Arvind : తాజాగా నిర్మాత అల్లు అరవింద్ ఓ యాంకర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కిరణ్ అబ్బవరం నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా జులై 24న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నిర్మాత అల్లు అరవింద్ గెస్ట్ గా హాజరయ్యారు.
అయితే ఈ ఈవెంట్ ని యాంకర్ చర్మిళ్ల హోస్ట్ చేసింది. ఆర్జేగా కెరీర్ మొదలుపెట్టిన చర్మిళ్ల ఇటీవలే యాంకర్ గా మారింది. ఇంటర్వ్యూలతో పాటు సినిమా ఈవెంట్స్ కూడా హోస్ట్ చేస్తుంది. అయితే ఈ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడే ముందు యాంకర్ చర్మిళ్ల సరదాగా.. ఈ సినిమాలో తొలిప్రేమేం తోపు కాదు అన్నారు. మీరేమంటారు తొలిప్రేమ మీద అని అడిగింది.
Also Read : Akhil Bhagyashri Borse : టీవీ షోలో సందడి చేసిన అఖిల్, భాగ్యశ్రీ భోర్సే.. ఫొటోలు..
దీంతో అల్లు అరవింద్ సరదాగా మాట్లాడుతూ.. టైటిల్ చెన్నై లవ్ స్టోరీ కదా నాకు కనెక్ట్ అయింది. లవ్ చేసే ఏజ్ లో నేను చెన్నైలోనే ఉన్నాను, చెన్నైలో చదువుకున్నాను అని అన్నారు. ఈ క్రమంలో యాంకర్ తో.. ఈ మధ్య యాంకర్స్ కూడా హీరోయిన్ లా కనిపిస్తున్నారు. నెక్స్ట్ సినిమాలో నటిస్తావా అని అడిగారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పుడిప్పుడే ఎంటర్ అయి ఫాస్ట్ గా యాంకర్ గా దూసుకుపోతున్న చర్మిళ్ల రేపోమాపో నటిగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఈ మధ్య యాంకర్స్ కూడా హీరోయిన్లలా కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేస్తావా?
Allu Aravind to anchor RJ Charmilla#ChennaiLoveStory Trailer Launch Event pic.twitter.com/Z1dTTRpy5j
— idlebrain.com (@idlebraindotcom) July 18, 2026
