Ameerlog Song : ‘అమీర్ లోగ్’ నుంచి సీదా హెలికాప్టర్ షాట్.. సాంగ్ రిలీజ్..
మీరు కూడా ఈ 'సీదా హెలికాప్టర్ షాట్ సాంగ్ చూసేయండి.. (Ameerlog Song)
Ameerlog Song
Ameerlog Song : రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ రిలీజ్ చేస్తున్న సినిమా అమీర్ లోగ్. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణ రెడ్డి సోమ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. MC హరి, మనోజ్, శశిధర్, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ రిలీజ్ అయింది.
హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసారు. ‘సీదా హెలికాప్టర్ షాట్’ అనే స్ట్రీట్ ఆంథమ్ ని రిలీజ్ చేసారు. స్మరణ్ సాయి సంగీత దర్శకత్వంలో ఎంసి హరి రాసి పాడారు. కుర్రాళ్లకు ప్రతీకగా ఈ పాటలో స్నేహం విలువ, యువత ఆశయాలు, ఆత్మ విశ్వాసం కనిపించేలా ఈ సాంగ్ ఉంది. ఈ సాంగ్ విజువల్స్ కూడా కొత్తగా ఉన్నాయి. హైదరబాద్ గల్లీలలోనే ఈ పాటను చిత్రీకరించారు.
Also Read : Saanve Megghana : మాల్దీవ్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న తెలుగు హీరోయిన్..
మీరు కూడా ఈ ‘సీదా హెలికాప్టర్ షాట్ సాంగ్ చూసేయండి..
