NTR – Arun Dev : అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు ఈ పిల్లాడు.. 30 ఏళ్ళ తర్వాత..
30 ఏళ్ళ క్రితం తెలుగు సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సాధించిన రికార్డ్ ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ పోతుల సాధించాడు. (NTR - Arun Dev)
NTR - Arun Dev
NTR – Arun Dev : 30 ఏళ్ళ క్రితం తెలుగు సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సాధించిన రికార్డ్ ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ పోతుల సాధించాడు. తాజాగా 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుల్లో 2024 సంవత్సరానికి గాను ’35 – చిన్న కథ కాదు’ సినిమాకు ఉత్తమ బాలల చిత్రం అవార్డు వరించింది. అంతే కాకుండా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన బాల నటుడు అరుణ్దేవ్ పోతులకు ఉత్తమ బాల నటుడు అవార్డు కూడా వరించడం గమనార్హం.
గుణశేఖర్ దర్శకత్వంలో 1997 లో జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు చేసిన బాల రామాయణం సినిమాకు జాతీయ ఉత్తమ బాలల చిత్రం అవార్డు వచ్చింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తెలుగు సినిమాకు ఉత్తమ బాలల చిత్రం అవార్డు రావడం గమనార్హం. అప్పుడు ఎన్టీఆర్ బాల రామాయణం సినిమాతో సాధిస్తే ఇప్పుడు అరుణ్ దేవ్ 35 – చిన్న కథ కాదు సినిమాతో సాధించాడు. పైగా ఉత్తమ బాల నటుడు అవార్డు కూడా సాధించి ఎన్టీఆర్ కంటే ఒక అవార్డు ఎక్కువే తెచ్చుకున్నాడు.
Also Read : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంకు కొత్త స్టార్ ట్యాగ్.. మా సినిమాలో అదే వేస్తాం.. నిర్మాత కామెంట్స్ వైరల్..
అప్పట్లో బాల రామాయణం సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు కూడా ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాల నటుడు ఎన్టీఆర్, ఉత్తమ బాల నటి స్వాతి లకు వరించాయి. కొన్ని రోజుల క్రితం 35 – చిన్న కథ కాదు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల్లో కూడా ఉత్తమ బాలల చిత్రంతో పాటు, ఉత్తమ బాల నటుడు అరుణ్ దేవ్ కు అవార్డులు రావడం విశేషం. మొత్తానికి ఎన్టీఆర్ సినిమా తర్వాత 30 ఏళ్లకు ఒక తెలుగు బాలల చిత్రంకు అవార్డులు రావడంతో 35 – చిన్న కథ కాదు సినిమాకు, చైల్డ్ ఆర్టిస్ట్ కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

