Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంకు కొత్త స్టార్ ట్యాగ్.. మా సినిమాలో అదే వేస్తాం.. నిర్మాత కామెంట్స్ వైరల్..
ఈ ఈవెంట్లో నిర్మాత మైత్రి రవిశంకర్ కిరణ్ అబ్బవరంకి ఆసక్తికర ట్యాగ్ ఇచ్చారు.(Kiran Abbavaram)
Kiran Abbavaram
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ఎలాంటి సినిమా బ్యాక్ డ్రాప్ లేకుండా షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు. మొదట సినిమాలు హిట్స్ కొట్టి మధ్యలో ఫ్లాప్స్ వచ్చినా మళ్ళీ క సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అనే ఓ మంచి సినిమాతో రాబోతున్నాడు.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్లో నిర్మాత మైత్రి రవిశంకర్ కిరణ్ అబ్బవరంకి ఆసక్తికర ట్యాగ్ ఇచ్చారు. సాధారణంగా మన హీరోలందరికీ పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. ఏదో ఒక స్టార్ పేరుతో అభిమానులు తమ హీరోని పిలుచుకుంటారు. గతంలో స్టార్ హీరోలకు మాత్రమే వేసుకునే ట్యాగ్ ఇప్పుడు ప్రతి హీరో పేరుకి ముందు వేస్తున్నారు. హీరోలు స్వతహాగా ఈ స్టార్ ట్యాగ్స్ పెట్టుకోకపోయినా అభిమానులు లేదా హీరో చుట్టుపక్కల ఉండే వాళ్ళు పెడతారు. ఇప్పటివరకు కిరణ్ అబ్బవరంకు అలాంటి ట్యాగ్ ఏమి లేదు.
ఇపుడు నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ఒక్కొక్క హీరోకు ఒక స్టార్ ట్యాగ్ ఉంటుంది. వాళ్ళను చూసి అవి పెడుతూ ఉంటారు. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చూస్తే ఈయనకు ఒరిజినల్ స్టార్ అని పెట్టాలని ఉంది. ఆయన యాక్టింగ్ లో ఒరిజినాలిటీ ఉంటుంది. ఎలాంటి ఫేక్ ఉండదు. చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ఈ సినిమాతో, నెక్స్ట్ సినిమాతో కిరణ్ అబ్బవరం మనం ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడటానికి కూడా అందుబాటులో ఉండకుండా ఎదుగుతాడు. మేము ఫోన్ చేస్తే ఎత్తకుండా ఉండడు అనుకుంటున్నా. నేను ప్రామిస్ చేస్తున్నా భవిష్యత్తులో అతనితో మేము తీయబోయే సినిమాలో ఒరిజినల్ స్టార్ అని వేసుకుంటాము. అది అతను యాక్టింగ్ క్యాపబిలిటీ అని అన్నారు. ఇకపై కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఒరిజినల్ స్టార్ అని తమ హీరోని ప్రమోట్ చేసుకుంటారేమో చూడాలి.
Natural Star @NameisNani
Original Star @Kiran_Abbavaram
"Next మా movie lo 'ఒరిజినల్ స్టార్' tag vestham”.
– Ravi @MythriOfficial pic.twitter.com/omwaLkT7Ff
— M9 NEWS (@M9News_) July 18, 2026
