Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. ఎమ్మెల్యే పీఏకు గాయాలు
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Road Accident In AP
- ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
- లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
- ఎమ్మెల్యే పీఏకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ జిల్లా పరిధిలోని ఆనందపురం – అనకాపల్లి జాతీయ రహదారి గండిగుండం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరికి గాయాలయ్యాయి.
పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఓ కుటుంబం కారులో వెళ్తుంది. ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్దకు రాగానే కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురిలో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. అదేకారులో ఉన్న నరసరావుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ను చికిత్స నిమిత్తం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి పోలీసులు రూట్ ను క్లియర్ చేశారు.
