Gossip Garage : మొన్న వంశీ.. నిన్న పోసాని.. వైసీపీలో నెక్ట్స్ అరెస్ట్ రజినిదేనా? ఏసీబీ కేసులో బిగుస్తున్న ఉచ్చు..

ఇప్పుడు రజినిని బ్యాడ్‌టైమ్‌ వెంటాడుతుందా అనిపిస్తోంది.. వరుస పరిణామాలు చూస్తుంటే..

Gossip Garage : విడదల రజిని.. పరిచయం అవసరం లేని పేరు. చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించుకొని.. స్పెషల్ అనిపించుకున్నారు. కట్ చేస్తే గత ఎన్నికల్లో ఓటమి.. రజినికి అన్ని రకాలుగా చుక్కలు చూపిస్తోంది. ఓవైపు కేసులు.. మరోవైపు అవినీతి ఆరోపణలు.. ఇంకోవైపు పార్టీలో సీన్‌.. పరిస్థితులు రజినితో ఫుట్‌బాల్ ఆడుతున్నాయ్. ఇప్పుడు ఏసీబీ కేసులో ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. అసలు విడదల వాట్ నెక్ట్స్‌.. రాబోయే రోజుల్లో మరిన్ని చుక్కలు చూడడం ఖాయమా..

మొన్న వంశీ.. నిన్న పోసాని.. నెక్ట్స్ ఎవరు ! ఏపీలో వరుస అరెస్ట్‌ల వేళ వినిపిస్తున్న ప్రశ్న ఇది. అధికారం అడ్డం పెట్టుకొని చాలామంది వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్న కూటమి సర్కార్‌.. ఒక్కొక్కరి లెక్కలు తేలుస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య మాజీ మంత్రి విడదల రజిని చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. దీంతో త్వరలోనే ఆమె జైలుకెళ్లక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయ్. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే అన్నీ సిద్ధం చేయగా.. కొన్ని అనుమతులు రావాల్సి ఉందని తెలుస్తోంది.

Also Read : ఏపీలో ఎమ్మెల్సీ హీట్.. నాగబాబుకు లైన్ క్లియర్.. టీడీపీకి మిగిలేవి ఎన్ని? బీజేపీ ట్విస్ట్ ఇస్తుందా..

2019లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రజిని.. జగన్ సెకండ్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. వైద్యారోగ్య శాఖా మంత్రిగా పని చేశారు. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు మారిపోయి.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఓటమి తర్వాత అటు పార్టీలోనూ.. ఇటు పర్సనల్‌గా రజినికి కష్టాలే ఎదురవుతున్నాయ్. ఇప్పుడు ఏసీబీ ఉచ్చు బిగుసుకునే పరిస్థితి కనిపిస్తోంది.

ఏకంగా రూ.2 కోట్లకు పైగా వసూలు..!
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రజినీ భారీగా వసూళ్లు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయ్. స్టోన్ క్రషర్ యజమానుల నుంచి.. ఏకంగా 2 కోట్లకు పైగా వసూలు చేశారనే ఆరోపణలు వినిపించగా.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ జరిపారు. వసూళ్ల పర్వం నిజమేనని తేల్చారు. ఈ నివేదికను ప్రభుత్వానికి కూడా అందించారు. రిపోర్ట్ ఆధారంగా అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే దృష్టి సారించింది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువాపై కేసు నమోదుతో పాటు.. విచారణ చేసేందుకు అనుమతించాలన్న ఏసీబీ అభ్యర్థనకు సీఎస్ అనుమతి మంజూరు చేశారు.

రజిని అరెస్ట్ ఖాయం..!
ఇక రజినిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతించాలని గవర్నర్‌కు ఏసీబీ లేఖ రాసింది. గవర్నర్ నుంచి అనుమతి రాగానే రజనీపై కేసు నమోదు చేయడంతో పాటు విచారించేందుకు ఏసీబీ రెడీగా ఉంది. అదే జరిగితే.. ఎలాగూ నేరం ప్రూవ్ కావడంతో.. రజిని అరెస్ట్ ఖాయం అనే చర్చ జరుగుతోంది.

ఏసీబీ రూపంలోనే కాదు.. రాజకీయంగానూ రజినిని కష్టాలు వెంటాడుతున్నాయ్. క్లియర్‌గా చెప్పాలంటే.. పరిస్థితులు ఫుట్‌బాల్‌ ఆడేస్తున్నాయ్ ఆమెతో ! గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. రజినిని చాలా వివాదాలు చుట్టుముట్టాయ్‌. ఇసుక, కమీషన్లు, భూ అక్రమాల్లో రజని హస్తంపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయ్ ఇప్పటికీ!

ఓవైపు ఓటమి.. మరోవైపు అవినీతి ఆరోపణలు రజనిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు రజని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. ప్రత్తిపాటిపై ఆ మధ్య ఫైర్ అయింది కూడా అందుకే. రజినీకి పార్టీ హైకమాండ్ కూడా సపోర్ట్‌గా ఉండడంతో.. ఇప్పటికీ పార్టీలో మంచి పట్టుందనే అనుకున్నారు అంతా ! ఐతే పార్టీలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్య పోస్టూ లేదు. ఇప్పటికీ రజిని మాజీ మంత్రి మాత్రమే. పార్టీపరంగా ఆమెకు ఇప్పటికీ మంచి పోస్టు దక్కలేదు.

Also Read : తెర మీదకి మళ్లీ ఫైర్ బ్రాండ్..! రాములమ్మ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అంటూ మీనాక్షి ఆరా!

జంపింగ్ దాదాపు ఫిక్స్ అయినట్లే అనే గుసగుస..
గత ఎన్నికల ముందు చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు పంపించారు జగన్. ఐతే అక్కడ ఓడిపోవడంతో.. తనకు జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని రజిని ఆశించారు. అయితే ఆ పోస్టును అంబటి రాంబాబుకు ఇచ్చారు. కనీసం గుంటూరు అర్బన్ జిల్లా పదవి అయినా ఇస్తారనుకుంటే.. అది కూడా జరగలేదు. ఇక చిలకలూరిపేటలో అయినా పరిస్థితులు బాగున్నాయా అంటే.. అదీ లేదు.

లోకల్‌ నాయకుడు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌తో చిలకలూరిపేటలో విభేదాలు కొనసాగుతున్నాయ్. రజిని మళ్లీ చిలకలూరిపేటకు వస్తే.. తాను పార్టీని వీడేందుకు కూడా సిద్ధం అన్నట్లుగా రాజశేఖర్ తీరు కనిపిస్తోంది. చిలకలూరిపేటలో రజిని మళ్లీ యాక్టివ్ కావడంతో.. జంపింగ్ దాదాపు ఫిక్స్ అయినట్లే అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. జగన్‌కు సన్నిహితుడిగా రాజశేఖర్‌కు పేరు. అలాంటిది ఇప్పుడు అధినేత నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు రజినిని బ్యాడ్‌టైమ్‌ వెంటాడుతుందా అనిపిస్తోంది.. వరుస పరిణామాలు చూస్తుంటే..!